అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి.
అమెరికన్లపైనా ఇవి ప్రభావం చూపుతున్నాయి.దేశాన్ని ట్రంప్ నడిపిస్తున్న తీరుతో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విభాగంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ వలసదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని వారి స్వదేశాలకు తరలిస్తున్నారు ట్రంప్.

అంతర్జాతీయ విద్యార్ధులకు ( international students )కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తూ వారిని దేశం నుంచే పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ట్రంప్.హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా క్యాంపస్‌లలో నిరసన తెలిపిన వారిని టార్గెట్ చేసిన ట్రంప్ సాంకేతికత సాయంతో దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.ఇలాంటి నిరసనలకు అనుమతులు ఇచ్చే విద్యాసంస్ధలకు ఫెడరల్ ఫండ్స్ కట్( Federal funds cut for educational institutions ) చేస్తానని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.నిరసనల్లో పాల్గొన్న వారితో పాటు సోషల్ మీడియాలో వీటికి మద్ధతుగా నిలిచిన వారిపైనా ట్రంప్ యంత్రాంగం కన్నేసింది.
విద్యార్ధులు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే స్వచ్ఛందంగా సీబీపీ యాప్ ద్వారా దేశం నుంచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం సూచించింది.

ఈ నేపథ్యంలో అమెరికాలో విదేశీ విద్యార్ధుల వీసాల రద్దుకు సంబంధించి ఓ కథనం నెట్టింట చక్కర్లు కొడుతోంది.అమెరికా రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా వీసా రద్దు జరుగుతున్నట్లుగా ఆ కథనం పేర్కొంది.ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డేటా బేస్‌ను పరిశీలించిన తర్వాత తాము ఆశ్చర్యపోయినట్లు పలు వర్సిటీల అధికారులు తెలిపారు.
వీసా రద్దుకు దారి తీసిన కారణాలను కూడా ప్రభుత్వం పేర్కొనడం లేదని ఆయా సంస్థల ప్రతినిధులు అంటున్నారు.బాధితుల్లో పలువురు భారతీయ విద్యార్ధులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ పరిస్ధితుల్లో అంతర్జాతీయ విద్యార్ధులు అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.