ఇండియాలో ఎవరైనా కూడా డా బీచ్ లో సందడి చేసే సౌలభ్యం ఉంది.అమెరికా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఆ సౌలభ్యం అమ్మాయిలకు విచ్చలవిడిగా ఉంది.
అయితే ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, అరబిక్ దేశాలు, మైన్మార్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే దారుణమైన శిక్షలు కూడా ఉంటాయి.
సాంప్రదాయాలకు విలువ ఇవ్వని వారిని అక్కడి ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా చూస్తాయి.ఈ నేపథ్యంలో తాజాగా నాంగ్ మీవ్ సాన్ మూన్ అనే మోడల్ తరుచుగా సముద్ర తీరంలో బికినీ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో లో షేర్ చేస్తోంది.
ఈమె డాక్టర్గా మైన్మార్ దేశంలో పనిచేస్తుంది.అయితే అప్పుడప్పుడు మోడల్ గా కూడా చేస్తున్న ఈ భామ అ బికినీ ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అయితే అలా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది.మయన్మార్ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉందంటూ ఆ దేశ మెడికల్ కౌన్సిల్ తన డాక్టర్ లైసెన్స్ రద్దు చేసింది.
గతంలో ఆమె ఇలాగే బికినీ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టగా, తర్వాత మెడికల్ కౌన్సిల్ వార్నింగ్ వివరణ ఇచ్చుకుని ఇకపై అలా చేయబోనని మాట ఇచ్చింది.అయినా కూడా సంప్రదాయాలకు వ్యతిరేకంగా మరల అలాంటి ఫొటోలు పెట్టడంతో మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయ్యి ఆమె డాక్టర్ లైసెన్స్ రద్దు చేయడం జరిగింది.
అయితే ఇలా చేయడం తన స్వేచ్ఛను అడ్డుకోవడమే అని ఈ మోడల్ ఆరోపిస్తుంది.తాను రోగులకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి దుస్తులు ధరిస్తే తప్పు పట్టాలు కానీ.
ఇలా తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరైన నిర్ణయం కాదని, దీనికోసం తాను పోరాటం చేస్తానని ఈ భామ చెప్పుకొచ్చింది.