ముఖ్యంగా చెప్పాలంటే మెదడు( Brain ) బాగా పని చేస్తే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి వీలు ఉంటుంది.అలాగే ఎన్ని పనులైనా సరే చక్కగా సంతోషంగా చేసుకోవచ్చు.
అయితే మెదడు సరిగ్గా పని చేయకపోతే మనకి ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.ఏ పని కూడా సక్రమంగా చేయలేము.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను( Food items ) తీసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది.అలాగే జ్ఞాపక శక్తి( Memory Power )ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.
అమెరికాలోని హార్డ్ వర్క్ మెడికల్ కాలేజ్ కి చెందిన న్యూట్రిషన్ సైకాలజిస్ట్లు ఈ విషయాలను వెల్లడించారు.మెదడు పేగులు ఒకే కణాల నుంచి తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అందుకే మంచి ఆహారాన్ని తీసుకుంటే మెదడు పని తీరు బాగుంటుంది.ఆకలి నియంత్రణ ఇతర జీవక్రియ( Metabolism )లకు సంబంధించిన 90% హార్మోన్స్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి.అందుకని మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి.ముఖ్యంగా మెదడు పని తీరు బాగుండడం కోసం విటమిన్ బి, విటమిన్ బి12, విటమిన్ బి 9 ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
ముఖ్యంగా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి.అలాగే సుగంధద్రవ్యాలు, పసుపు, కుంకుమ వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి.
ఇంకా చెప్పాలంటే పెరుగును తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.బ్రెయిన్ పవర్ ని కూడా ఇది పెంచుతుంది.యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల వాల్నట్స్ ని తీసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.అలాగే డార్క్ చాక్లెట్,( Dark Chocolate ) తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, పాలు వంటి ఆహార పదార్థాల ను కూడా తీసుకుంటూ ఉండాలి.
అప్పుడు మెదడు పని తీరు బాగుంటుంది.ముఖ్యంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.