Blood Cancer Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. బ్ల‌డ్ క్యాన్స‌ర్ కు సంకేతం కావొచ్చు జాగ్ర‌త్త ప‌డండి!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది క్యాన్స‌ర్( Cancer ) తో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య అంత‌కంతుకు పెరిగిపోతోంది.క్యాన్స‌ర్ లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది బ్ల‌డ్ క్యాన్స‌ర్.

 What Are The Symptoms Of Blood Cancer-TeluguStop.com

ఇది రక్త కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్.ల్యుకేమియా, లింఫోమా మరియు మైలోమా బ్ల‌డ్ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ రకాలు.

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ్వ‌రైనా ఈ మహ‌మ్మారి బారిన ప‌డ‌వ‌చ్చు.బ్లడ్ క్యాన్సర్( Blood Cancer ) బోన్ మ్యారోలో ప్రారంభ‌మై క్రమంగా ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది.

అయితే ముందుగా గుర్తించి జాగ్ర‌త్త ప‌డితే బ్ల‌డ్ క్యాన్స‌ర్ ను జ‌యించ‌వ‌చ్చు.ఈ నేప‌థ్యంలోనే బ్లడ్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఏ విధంగా ఉంటాయి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Cancer, Cancersymptoms, Cancer Symptoms, Tips, Latest, Leukaemia, Symptom

బ్ల‌డ్ క్యాన్స‌ర్ ను లుకేమియా( Lukemia ) అని కూడా పిలుస్తారు.ఇది శరీరంలో అనేక భాగాలను ప్రభావితం చేసే వ్యాధి.బ్ల‌డ్ క్యాన్స‌ర్ త‌లెత్త‌డానికి కుటుంబ చరిత్ర, రేడియేషన్, ధూమ‌పానం, ప‌లు ర‌కాల కెమిక‌ల్స్ కు బ‌హిర్గ‌తం కావ‌డం వంటివి ప్ర‌ధాన‌ కార‌ణాలు.బ్ల‌డ్ క్యాన్స‌ర్‌ బారిన ప‌డ్డ రోగుల్లో విప‌రీత‌మైన నీర‌సం, అల‌స‌ట‌, ఉన్న‌ట్లుండి బ‌రువు త‌గ్గిపోవ‌డం, త‌ర‌చూ జ్వ‌రం రావ‌డం( Fever ), చిన్న గాయ‌మైనా అధికంగా ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డం, శ్వాస స‌రిగ్గా ఆడకపోవడం, రాత్రుళ్లు చెమటలు ఎక్కువ‌గా ప‌ట్ట‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అలాగే తీవ్రమైన అంటువ్యాధులు, ఎముకలు, కీళ్ళు లేదా పొత్తికడుపులో నొప్పి, చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద‌, ముక్కు మ‌రియు చిగుళ్ల నుంచి రక్తస్రావం, శరీరం రంగు పసుపు రంగులోకి మార‌డం త‌దిత‌ర ల‌క్ష‌ణాల‌న్నీ రోగిలో క‌నిపిస్తుంటాయి.

Telugu Cancer, Cancersymptoms, Cancer Symptoms, Tips, Latest, Leukaemia, Symptom

ఇటువంటి ల‌క్ష‌ణాలు( Blood Cancer Symptoms ) మీలో క‌నుక క‌నిపిస్తే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించి సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవాలి.కీమోథెరపీ, ఇతర ట్రీట్‌మెంట్స్ ద్వారా బ్ల‌డ్ క్యాన్స‌ర్ ను జ‌యించ‌వ‌చ్చు. కీమోథెరపీ( Chemotherapy ) కుద‌ర‌క‌పోతే స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాయి.

అయితే కొన్ని సందర్భాల్లో బ్లడ్‌ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలేవీ పైకి కనిపించవు.చివరి దశకు చేరుకున్న తర్వాత గుర్తించేందుకు వీలు ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube