ఇటీవల కాలంలో అమ్మాయిలు మేకప్ లేనిదే బయటకు వెళ్లడం లేదు.సినీతారలే కాదు సామాన్య మహిళలు కూడా మేకప్ వేసుకునే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
నలుగురిలో ఉన్నప్పుడు అందంగా కనబడాలని తెగ మేకప్ వేసుకుంటుంటారు.అయితే మేకప్ వేసుకోవడం వల్ల అందంగా కనిపించడంతో పాటు అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
మేకప్ ప్రోడెక్ట్స్‌లో ఉండే కొన్ని హానికరమైన రసాయనాలు చాలా నష్టాన్ని కలిగిస్తాయి.అలాగే అతిగా మేకప్ వేసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్, ఇతర చర్య సమస్యలు వచ్చే రిస్క్ కూడా ఎక్కువ.
అందుకే మన అందాన్ని సహజసిద్ధంగానే మెరిపించుకోవడానికి ప్రయత్నించాలి.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే మేకప్ లేకపోయినా అందంగానే కనిపించవచ్చు.
అందులో శెనగపిండి, పసుపు మరియు పెరుగు ఈ మూడు తీసుకుని బాగా మిక్స్ చేయాలి.అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేయడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు, మొటిమలను తగ్గిస్తుంది.మరియు ఆయిల్ స్కిన్ వారు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై జిడ్డు పీల్చుకుని.
చర్మాన్ని తాజాగా చేస్తుంది.

అలాగే కాఫీ పౌడర్, అలోవెర జెల్, పెరుగు మరియు శెనగపిండి ఈ నాలుగు తీసుకుని బాగా మిక్స్ చేయాలి.అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేయడం వల్ల ట్యాన్ రిమూవ్ అవ్వడంతో పాటు ముఖంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది.
ఇక ప్రతి రోజు పడుకునే ముందు ముఖానికి మరియు పెదవులకు రోజ్‌వాటర్ అప్లై చేసి పడుకోవాలి.ఇలా చేయడం వల్ల ఉదయానికి మీ ముఖం కాంతివంతంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
అదేవిధంగా, చర్మాన్ని హైడ్రేషన్‌గా ఉంచటం చాలా ముఖ్యంగా.అందుకు మీరు ఖచ్చితంగా డైలీ రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ తాగాలి.
వాటర్ తాగడం వల్ల చర్మం బిగుతుగా, మృదువుగా, నునుపుగా కూడా తయారవుతుంది.