ఈ కాయలు ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి .. 100 రోగాలను..

బుడమ కాయలు దాదాపు ఈ కాలం వారికి చాలా వరకు తెలియదు అనే చెప్పాలి.ఇవి దాదాపు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి.

 Health Benefits On Budama Kayalu Details, Health Benefits ,budama Kayalu, Budama-TeluguStop.com

అయితే ఆరోగ్యానికి ఇవి చేసే మేలు తెలియక ఇన్ని రోజులు వీటిని పనికిరాని కాయలుగా చాలామంది భావించారు.వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాయ పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ దీనిలోని పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.బుడమ కాయలను నేరుగా కూడా తినవచ్చు.

ఈ కాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.ఇందులో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, ఐరన్, ఫైబర్, జింక్, ఫాస్ఫరస్, ఫోలిక్ వంటి విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

వీటిని తినడం వల్ల సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంది.బుడమ కాయల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వలన వీటిని తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

ఫలితంగా ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు.దానివల్ల బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Telugu Bad Cholestrol, Budama Kayalu, Budamakayalu, Diabetes, Benefits, Tips, Pr

బుడమ కాయలతో కూరలు కూడా వండుకొని తినవచ్చు.చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది.షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి .ఈ కాయ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.వీటిని తినడం వల్ల కాలయం పనితీరును మెరుగుపరచడమే కాకుండా కామెర్ల చికిత్సలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Telugu Bad Cholestrol, Budama Kayalu, Budamakayalu, Diabetes, Benefits, Tips, Pr

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ కారకాలు యాంటీ ఏజింగ్ ఏజెంట్లగా కూడా పనిచేస్తాయి.అంటే వృద్ధాప్య ఛాయలు దగ్గరికి రాకుండా చేస్తాయి.అలాగే రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి.ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.ఇవన్నీ ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి.కాబట్టి ఈ మొక్క ఎక్కడ కనిపించినా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube