ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో ఎండల దెబ్బకు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరి చర్మం ట్యానింగ్‌కు గురవుతుంది.
ముఖ్యంగా ముఖంపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది.దాంతో ఈ ట్యాన్ సమస్యను నివారించుకునేందుకు ఏం చేయాలో తెలియక రకరకాల క్రీములు, లోషన్లు వాడుతంటారు.
అయితే ట్యాన్ సమస్యకు చెక్ పెట్టడంలో క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుంది.క్యారెట్‌లో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు.
ముఖాన్ని డీట్యాన్ చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.మరి క్యారెట్‌ను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా క్యారెట్‌ను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో కొద్దిగా పెసరపిండి మరియు నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖాన్ని కావాలనుకుంటే మెడకు అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే ట్యాన్ సమస్య దూరమై.
ముఖం కాంతివంతంగా మారుతుంది.

అలాగే క్యారెట్‌ను ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలి.ఇప్పుడు ఆ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా తేనె కలిపి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అర గంట పాటు వదిలేయాలి.
అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ముఖం డీట్యాన్ అవుతుంది.
ఇక క్యారెట్ ను మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఆ రసంలో చందనం పొడి మరియు చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు పూసుకుని.పావు గంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం కొద్దిగా నీళ్లు జల్లి వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.