సోషల్ మీడియాలో( social media ) ఓ కొత్త వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
కారణం ఏంటంటే, ఒక ఏనుగు డ్యాన్స్ చేస్తూ కనిపించడం.అది కూడా మామూలు డ్యాన్స్ కాదు, ఓ రేంజ్ లో బీట్ కి తగ్గట్టు స్టెప్పులేస్తూ అదరగొడుతోంది.
చుట్టూ జనం గుంపు, అదిరిపోయే మ్యూజిక్.చూడటానికి మాత్రం ఫన్నీగా ఉంది కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.
ఇది కేవలం 20 సెకన్ల వీడియోనే అయినా, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేశారు.వీడియో స్టార్ట్ అవ్వగానే కలర్‌ఫుల్ విజువల్స్, పండుగలా సందడి చేస్తున్న జనం, బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ ‘ఇల్యూమినాటి’( Illuminati ) మోగుతోంది.
ఆ గుంపు మధ్యలో ఓ ఏనుగు సైలెంట్‌గా నిలబడి ఉంది.దానికి మెడలో మెరిసే ఆభరణాలు, ఒళ్లంతా కలర్‌ఫుల్ డిజైన్లతో ఉన్న వస్త్రాలు ఉన్నాయి.గుడి దగ్గర ఊరేగింపుల్లో కనిపించే ఏనుగుల్లా గ్రాండ్‌గా ఉంది.
మొదట్లో ఏనుగు చాలా ప్రశాంతంగా ఉంది.మెల్లిగా తల, తొండం ఊపుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.కానీ ఒక్కసారి బీట్ పీక్స్‌కి వెళ్లగానే అసలు ట్విస్ట్ మొదలైంది.
కొందరు డ్యాన్సర్లు సరదాగా దాని తొండం తట్టగానే, ఏనుగు ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది.అందరూ షాక్ అయ్యేలా.ఏనుగు కాళ్లు పైకెత్తి, మ్యూజిక్‌కి తగ్గట్టు స్టెప్పులేస్తూ, చుట్టూ ఉన్న డ్యాన్సర్లతో పోటీ పడుతూ దుమ్ము రేపింది.అది బీట్‌తో సింక్ అవుతూ మూవ్ చేస్తుంటే జనం కేరింతలు కొట్టారు.
అదో మ్యాజికల్ మూమెంట్ లా అనిపించింది.కానీ ఆ ఏనుగు నిజం కాదు.
షాక్ అయ్యారా, అది మనిషి ఏనుగులాంటి కాస్ట్యూమ్ వేసుకుని చేసిన ఫీట్.ఆ కాస్ట్యూమ్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉందంటే, చాలామంది మొదట అది నిజమైన ఏనుగునే అనుకున్నారు.కానీ ఏనుగు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాకే అసలు విషయం అర్థమైంది.ఆ మూమెంట్స్ మరీ మనిషి చేసినట్టు ఉన్నాయి.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.జనాలు దీన్ని ‘సూపర్ ఐడియా’, ‘ఫన్నీగా ఉంది’, ‘పర్ఫెక్ట్ దేశీ స్టైల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది మొదట ఫూల్ అయినా, తర్వాత మాత్రం క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు.మొత్తానికి ఈ ఎంటర్‌టైనింగ్ క్లిప్ మాత్రం అందరికీ ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.