హాబీలంటే రకరకాలుంటాయి.కొందరు డ్యాన్స్ చేస్తారు, కొందరు వంట చేస్తారు, ఇంకొందరు పెయింటింగ్ వేస్తారు లేదా పాటలు పాడతారు.
కానీ ఓ అమ్మాయి వింత హాబీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది, కన్ఫ్యూజ్ చేస్తోంది, కొందరినైతే షాక్‌కు గురిచేస్తోంది.ఇంతకీ ఏంటా హాబీ అంటారా, చచ్చిన దోమలను సేకరించడం.
వినడానికే వింతగా ఉంది కదూ, ఆకాంక్ష రావత్ అనే కంటెంట్ క్రియేటర్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తన ఫ్రెండ్ ఈ విచిత్రమైన పనిని ఎలా చేస్తుందో చూపించింది.ఈమె దోమల్ని చంపేసి ఊరుకోదు.
చంపిన ప్రతీ దోమను ఓ పేపర్‌పై జాగ్రత్తగా అంటించి, దానికి ఓ పేరు పెట్టి, అది ఎప్పుడు, ఎక్కడ, ఏ టైమ్‌కి చనిపోయిందో పూర్తి వివరాలు రాసి పెడుతుంది.
వీడియో మొదట్లోనే ఆకాంక్ష హిందీలో, “జనాలకి పిచ్చి పిచ్చి హాబీలుంటాయి, కానీ దీనిది మరీ విచిత్రం.
మీకే చూపిస్తా చూడండి” అంటుంది.ఆ తర్వాత ఆ పేపర్‌ను చూపిస్తుంది.
ప్రతీ దోమను టేప్‌తో అంటించి, పక్కన వివరాలు రాసి ఉంటాయి.దోమలకు పెట్టిన పేర్లు ఏంటంటే, “సిగ్మా బోయ్”, “రమేష్”, “సురేష్”, “పూజ”, “టింకూ”, “సూరజ్”, “బబ్లీ”,( “Sigma Boy”, “Ramesh”, “Suresh”, “Pooja”, “Tinku”, “Suraj”, “Bubly” ) ఇంకా ఇలా బోలెడు పేర్లు.
పేర్లతో పాటు, ఆ దోమ ఎక్కడ, ఎప్పుడు తన తుది శ్వాస విడిచిందో కూడా క్లియర్‌గా రాసి ఉంది.
ఆకాంక్ష సరదాగా తన ఫ్రెండ్‌ను “సైకోపాత్” ( Psychopath )అని పిలుస్తూ, “ఎందుకిలా చేస్తున్నావ్?” అని అడుగుతుంది.కానీ ఆ అమ్మాయి నవ్వేస్తుందే తప్ప సరైన సమాధానం చెప్పదు.వాళ్ల చెల్లెల్ని ఇదే విషయం అడిగితే, ఆమె అసహ్యంగా ముఖం పెట్టి, “ఛీ ఛీ, నేనైతే ఇలాంటి పనులు అస్సలు చేయను” అని అంటుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫానులా వైరల్ అయింది.ఇప్పటికే 67 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరికి ఇది చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.మరికొందరేమో ఇది చాలా వింతగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని కామెంట్ చేస్తున్నారు.“ఎవరైనా ఇలా చేస్తారా? ఎందుకు?” అని ఒకరు ఆశ్చర్యపోతే, “ఆపండి.ఇది చాలా అసహ్యంగా ఉంది” అని మరొకరు కామెంట్ పెట్టారు.ఇంకొంతమందైతే, తాము కూడా చిన్నప్పుడు ఇలాగే దోమల్ని చంపి నోట్‌బుక్స్ వెనకాల అంటించేవాళ్లమని సరదాగా గుర్తుచేసుకుంటున్నారు.
ఏది ఏమైనా, సరదాగా అనిపించినా, భయానకంగా అనిపించినా, ఈ దోమల హత్యల రికార్డు, వాటి సేకరణ మాత్రం ఆన్‌లైన్‌లో అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షించింది.