యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )అభిమానులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో దేవర మూవీ ఫెయిలైంది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినా ఈ సినిమా స్థాయికి ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పవచ్చు.అయితే దేవర2 మూవీ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సంబంధించి తాజాగా పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది.
దేవర2 మూవీ( devara2 movie ) పక్కాగా ఉంటుందని జూనియర్ ఎన్టీఅర్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ) సినిమాకు ముందే దేవర2 సెట్స్ పైకి వెళ్లనుందట.కొరటాల శివ( Koratala Shiva ) ప్రస్తుతం ఈ సినిమాపై వర్క్ చేస్తున్నారని తెలుస్తోందే.
దేవర నిర్మాతలకు మంచి లాభాలను అందించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ( Arjun Son of Vyjayanthi Movie )ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు.దేవర2 మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించడం పక్కా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.దేవర2 సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.ఎన్టీఆర్ లైనప్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.తారక్ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటు సంచలనాలు సృష్టిస్తున్నారు.తారక్ కెరీర్ ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది.దేవర2 సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడనున్నామని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తోంది.