తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు లు వరుస సినిమాలు చేసిన కూడా ఆశించిన మేరకు విజయాలను అయితే సాధించలేకపోతున్నారు.ఇక నితిన్( Nithin ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం డిజాస్టర్ల బాటపడుతున్న విషయం మనకు తెలిసిందే మరి ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకురాక పోగా ఆయనకు ఉన్న పేరుని కూడా చెడగొడుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు.తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక తన తోటి హీరోలందరూ పాన్ ఇండియా( Pan India ) బాటపడుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మాత్రం తెలుగుకు మాత్రమే పరిమితమవుతూ చేసిన సినిమాలన్నింటితో డిజాస్టర్ లను మూట గట్టుకుంటున్నాడు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమా( Robinhood Movie ) కూడా అతనికి ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టలేకపోయింది.70 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా కేవలం 10 కోట్ల కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేయడం అనేది ఇప్పుడు ట్రేడ్ పండితులను సైతం ఒక ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎందుకంటే మొన్నటిదాకా నితిన్ కి 30 నుంచి 40 కోట్ల వరకు మార్కెట్ ఉందని అందరు అనుకునేవారు.
కానీ ఈ ఇప్పుడు చూస్తే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.

మరి ఇలాంటి సందర్భంలో నితిన్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం లో చాలా మంది హీరోలు ముందుకు సాగుతుంటే నితిన్ మాత్రం వెనకబడి పోతున్నాడు…
.