బతుకమ్మ అనగానే మనందరికీ తెలంగాణ సాంస్కృతిక పండుగ గుర్తొస్తుంది.కేసీయార్ ప్రభుత్వం వచ్చాక ఈ బతుకమ్మ పాండగను అధికారిక ఉత్సవంగా ప్రకటించడం జరిగింది.
దానికి చాలా సంతోషం.అయితే అక్కడినుండే మొదలైంది అసలు చిక్కు.
అంతకు మునుపు బతుకమ్మ( Bathukamma ) మీద ఎలాంటి పేరడీలు చేసేవారు కాదు.సంప్రదాయ పద్ధతిలో ఎలాగైతే ఉత్సవాలు జరిగేయో ఆదేమాదిరి జరిగేవి.
అధికారిక ఉత్సవం అని ఎప్పుడు అనిపించుకుందో అక్కడినుండే లేనిపోని ఆర్భాటాలు మొదలయ్యాయి.అవసరం వచ్చినపుడు ఏదో ఒకటి మమ అనిపించేస్తున్నారు కొన్నిచోట్ల అధికారులు.
దగ్గరలో ఓ కుండీ కనిపిస్తే అందులో ఏదో డెకరేటివ్ మొక్క పెట్టి, మధ్యలో ఓ తివాచీ వేయించి మగ అధికారులే కాళ్లతో బూట్లు తీయకుండా ఇష్టారాజ్యంగా తిరగడం మనం చూస్తూ వున్నాం.ఈలోపు డీజే హడావుడి ఎలాగూ మొదలవుతుంది.
ఎవరో ప్రైవేటు యూట్యూబ్ వాడు పాడిన ఓ చెత్త పాట వేస్తూ బతుకమ్మ ఉత్సవం అయిపోయిందని ఇంటికెళ్ళి గురకపెట్టి నిద్రపోతున్న పరిస్థితి.ఆ రకంగా నేడు బతుకమ్మ పాటను, ఆటను, పండుగను, విశిష్టతను, సంబరాన్ని, ధ్వంసం చేస్తున్నారు.
అదే ఒకెత్తనుకుంటే ఈ మధ్యలో సినిమావాళ్లు వుండనేవున్నారు.సినిమాల్లో కూడా ఈమధ్యకాలంలో తెలంగాణతనం ఎక్కువైంది.ఆ పాట, ఆ ఆట, ఆ పండుగలు, ఆ కన్నీళ్లు, ఆ ఆనందాలు, ఆ కథలు హైలైట్ అవుతున్నయ్.మనం కూడా చూస్తున్నాము.ఈ క్రమంలోనే జీవమున్న సాంస్కృతిక ధార “రజాకార్” ( Rajakar )అనే సినిమా వస్తోంది.నాటి రజాకార్ల, జమీందార్ల అరాచకాల కంటెంట్ ఆధారంగా ఈ సినిమా చూస్తున్నారు.
సినిమా విడుదల అవ్వలేదు కాబట్టి కధ జోలికి అప్పుడే పోలేము.అయితే ఏమధ్య అందులో పాట ఒకటి రిలీజ్ అయింది.
ఆ పాట రాసిన “కాసర్ల శ్యామ్” ( kasarla shyam )కలం బాగానే పనిచేసింది, అదేవిధంగా దానికి సంగీతం సమకూర్చిన “భీమ్స్ సిసిరోలియో”( Bheem’s Cicerolio ) కంపోజింగూ బాగుంది.ఎటొచ్చీ దీని కొరియోగ్రఫీ చూస్తేనే గుండె కలుక్కుమంటోంది అని బతుకమ్మ భక్తులు అంటున్నారు.
అవును, బతుకమ్మ చుట్టూ తిరగడానికి ఓ రిథమ్ వుంటుంది.పాదం కదిలినా, పదం కలిసినా, చప్పట్లు కొట్టినా ఓ దానికి ఓ పద్ధతి ఉంది.
కానీ దానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా సినిమాటిక్ స్టెప్పులు సమకూర్చడం కరెక్టు కాదని అంటున్నారు.మరి దానికి కొరియోగ్రఫీ ఎవరో తెలుసా? ప్రముఖ రచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర( suchitra ).అవును, గతంలో ఆమె కొరియోగ్రాఫర్.ఆమె కెరీర్‌లో ఏమేం గొప్ప సినిమాల స్టెప్పులు ఉన్నాయో తెలియదు గానీ చాన్నాళ్లుగా ఆమె సినిమా ఫీల్డ్ లో కనబడలేదు.
ఇపుడు సడెన్ గా వచ్చి ఈ బతుకమ్మ పాటకు ఇలా సగటు తెలుగు సినిమా బాపతు స్టెప్పులు కంపోజ్ చేసి మమ అనిపించేసిందని కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి మరి.దీనికి సమాధానం ఇక్కడ ఎవరు చెప్తారు?
.