ప్రతి అమ్మాయి గులాబీ రంగు పెదవులు కావాలని కోరుకుంటుంది.పెదవులు గులాబీ రంగులో ఉంటే ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది.
కొంతమందిలో ఎక్కువ కాఫీ లేదా టీ తాగటం, ఎండలో తిరగటం, పెదవులకి సరైన సంరక్షణ తీసుకోకపోవడం వలన పెదవులపై మచ్చలు ఏర్పడి కాస్త అసహ్యంగా కనపడతాయి.దీని కోసం ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.
మన ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో తగ్గించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
రాత్రి పడుకొనే ముందు కొంచెం బాదం నూనెను పెదాలకు రాసుకొని సున్నితంగా ఒక నిమిషము మసాజ్ చేసి ఆలా వదిలేసి మరుసటి రోజు ఉదయం పెదాలను శుభ్రంగా కడగాలి.
ఒక స్పూన్ నిమ్మరసంలో మూడు చుక్కల తేనే కలిపి పెదాలకు రాసి ఒక గంట తర్వాత తడి క్లాత్ తో తుడవాలి.
ఒక స్పూన్ బీట్ రూట్ రసంలో అరస్పూన్ పుదీనా రసం, కొంచెం తేనే కలిపి పెదాలకు రాసుకొని గంట తర్వాత తడి క్లాత్ తో తుడవాలి.
ప్రతి రోజు పడుకొనే ముందు పెదాలకు గ్లిజరిన్ రాస్తే కొన్ని రోజులకు గులాబీ రంగు పెదవులు మీకు సొంతం అవుతాయి.
ఒక స్పూన్ వంట సోడాలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని పెదవులకు రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.