సమ్మర్ సీజన్ మొదలవుతోంది.మార్చి నెల వచ్చిందో లేదో.
వాతావరణ ఉష్టోగ్రతలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.అయితే వేసవి వేడిని తట్టుకోవాలంటే.
పండ్లను, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.కానీ, మధుమేహం వ్యాధి ఉన్న వారు మాత్రం షుగర్ లెవల్స్ ఎక్కడ పెరిగిపోతాయో అని పండ్లు తినడానికే జంకుతుంటారు.
వాస్తవానికి షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకొనే పండ్లు కూడా ఉన్నాయి.వాటిని ఈ సమ్మర్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మరి లేటెందుకు షుగర్ ఉన్న వారు సమ్మర్‌లో ఏయే పండ్లు తీసుకుంటే మంచిదో చూసేయండి.నేరేడు పండ్లు.
మధుమేహం ఉన్న వారికి ఇవి ఓ వరం అని చెప్పుకోవచ్చు.నేరేడు పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండటమే కాదు.
వేసవి వేడి వల్ల వచ్చే నీరసం, అలసట వంటి సమస్యలనూ తగ్గిస్తాయి.
అలాగే స్టార్ ఫ్రూట్ మధుమేహులకు చాలా మేలు చేస్తుంది.
సమ్మర్‌లో తరచూ స్టార్ ఫ్రూట్‌ను తీసుకుంటే.అందులో ఉండే పలు పోషకాలు వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.
అదే సమయంలో ఎండల వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బ తినకుండా అడ్డు కట్ట వేస్తాయి.
సమ్మర్‌లో షుగర్ ఉన్న వారు తినగలిగే పండ్లలో ద్రాక్ష ఒకటి.
వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పకుండా ఉంటాయి.
ఆరెంజ్ పండ్లనూ మధుమేహం వ్యాధి గ్రస్తులు తీసుకోవచ్చు.ఆరెంజ్‌లను తింటే సమ్మర్‌లో ఎదురయ్యే అధిక దాహం, నీరసం, అలసట, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఇక యాపిల్, చెర్రీ, అవకాడో, కివి వంటి పండ్లను కూడా మధుమేహం ఉన్న వారు తినొచ్చు.

అయితే చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.పైన చెప్పిన ఏ పండునైనా షుగర్ ఉన్న వారు లిమిట్‌గానే తీసుకోవాలి.మంచిది అన్నారు కదా అని ఓవర్‌గా లాగించేస్తే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
జాగ్రత్త.