పూణే దగ్గర చారిత్రాత్మక సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు ఊహించని షాక్ తగిలింది.న్యూజిలాండ్‌కు( New Zealand ) చెందిన లూక్ అనే టూరిస్ట్ ఇండియా టూర్‌కు వచ్చి సింహగడ్ కోటను సందర్శించాడు.
‘లుకె ది ఎక్స్‌ప్లోరర్’ అనే తన యూట్యూబ్ ఛానెల్‌లో ఏప్రిల్ 6న వీడియో కూడా పెట్టాడు.“ఇండియాలోని ఈ కోట పిచ్చెక్కిస్తుంది.
” (This Fort In India Is Insane, (Sinhagad Fort)) అంటూ గంటకు పైగా వీడియోలో కోట అందాలను, అక్కడి లోకల్స్‌తో తన అనుభవాలను చూపించాడు లూక్.అయితే వీడియోలో అసలు ట్విస్ట్ ఏంటంటే.
లూక్ కోటపైకి వెళ్తుండగా కొంతమంది యువకులు కలిశారు.వాళ్లు ఛత్రపతి సంభాజీ నగర్ (పాత పేరు ఔరంగాబాద్) నుంచి వచ్చామని చెప్పారు.
మాటల మధ్యలో ఆ యువకులు మరాఠీ బూతులు మాట్లాడుతూ.వాటిని లూక్‌ను కూడా అనమని నవ్వేశారు.
సరదాగా చేస్తున్నారని, వాళ్లు ఏం అంటున్నారో తెలియక లూక్ కూడా వాళ్లతో కలిసి బూతులు తిట్టాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో( social media ) వైరల్ కావడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
నెటిజన్లు, చరిత్రను ప్రేమించేవాళ్లు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు సైతం ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు.విదేశీ అతిథిని అవమానించడం, చారిత్రాత్మక ప్రదేశాన్ని అపవిత్రం చేయడంపై ఆ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పూణే రూరల్ పోలీసులు ( Pune Rural Police )వెంటనే రంగంలోకి దిగారు.గుర్తు తెలియని ఆ యువకులపై కేసు నమోదు చేశారు.
హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.నిందితులపై సెక్షన్ 49 (దుర్భోధన), సెక్షన్ 302 (మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం), సెక్షన్ 351 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు పెట్టామని ఇన్‌స్పెక్టర్ సచిన్ వాంగడే తెలిపారు.
ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోయినా.వీడియోలో కనిపించిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.ఈ చేదు అనుభవం ఎదురైనా లూక్ మాత్రం ఇండియా టూర్‌ను ఆపలేదు.ముంబైలోని ధారవి, రాయ్‌గడ్‌లోని జంజీరా సీ ఫోర్ట్‌ను కూడా సందర్శిస్తూ తన ట్రావెల్ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు.
సింహగడ్ కోటకు మహారాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఛత్రపతి శివాజీ మహారాజ్ నమ్మిన బంటు తానాజీ మలుసరే.1670లో మొఘలుల నుంచి ఈ కోటను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.ఆయన ధైర్యానికి సింహగడ్ కోట ఒక గొప్ప చిహ్నం.