హిట్3 నచ్చకపోతే మహేష్ రాజమౌళి మూవీ చూడొద్దు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరో నాని పేరు కూడా ఒకటి.తరచూ నాని పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

 Nani If You Not Hit 3 Then Dont Watch Ssmb29, Ssmb29 Movie, Nani, Tollywood, Hit-TeluguStop.com

నాని ప్రస్తుతం నిర్మాతగా అలాగే హీరోగా బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఇలా రెండు రంగాల్లో రాణిస్తూ మంచి సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే హీరో నాని ఇప్పుడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3( Hit3 ).గతంలో విడుదల అయినా సినిమాలకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

శైలేష్ కొలను( Sailesh kolenu ) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటవ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.అలాగే హిట్‌ 1 హీరో అడివి శేష్‌, హిట్‌ 2 హీరో విశ్వక్‌ సేన్‌ అతిథులుగా వచ్చారు.

ఈ వేదికపై నాని మాట్లాడుతూ.నా ప్రతి సినిమా మార్నింగ్‌ షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ కి వెళతాను.

వెళ్లే ముందే రాజమౌళి గారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వస్తున్నారా? అని చెక్‌ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండే వాడిని.

Telugu Nani, Nanidont, Ssmb, Tollywood-Movie

సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్‌ అడిగేవాడిని.ప్రేమగా హగ్‌ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం.కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్‌ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం.

అయితే ఈ మధ్య థియేటర్‌ కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్‌ పడింది.ఈ మే 1న రాజమౌళి మార్నింగ్‌ షో చూడాలని కోరుకుంటున్నాను.ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్‌పోర్ట్‌ లాగేసుకుంటాను.శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి.

మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్‌స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు.కానీ, అలాంటిదేం ఉండదు.

ప్రమోషన్స్‌ కూడా ఒక్కటీ మిస్‌ అవకుండా తన సొంత సినిమాలా చేసింది.సినిమా సక్సెస్‌ ఈవెంట్‌ లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.

కోర్ట్‌ సినిమా నచ్చకపోతే హిట్‌ 3 చూడొద్దని చెప్పాను.ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను.

హిట్‌ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 ని చూడొద్దని సరదాగా అంటున్నాను.ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు.

ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే.మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్‌ చేస్తున్నా అని నాని అన్నాడు.

ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube