తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.వారందరూ చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.
మరి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ప్రతి యంగ్ హీరో కూడా పాన్ ఇండియా బాట పడుతుండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
కెరియర్ ఫేడ్ అవుట్ దశకి చాలా దగ్గరగా ఉన్న హీరోలు ఇప్పుడు సక్సెస్ లను సాధిస్తే మాత్రం పర్లేదు లేకపోతే మాత్రం షెడ్డు కి వెళ్లి పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు.ముఖ్యంగా గోపీచంద్( Gopichand ) లాంటి నటుడు సరైన సక్సెస్ ని సాధించి పది సంవత్సరాలవుతుంది.
అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ అయితే పడడం లేదు.

లౌక్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పటివరకు మరొక సక్సెస్ అయితే సాధించలేదు.ఇక ఇప్పుడు సంకల్ప రెడ్డి( Sankalp Reddy ) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.ఈ సినిమా తర్వాత ఆయన చేయబోతున్న సినిమాలన్నిటితో మంచి విజయాలను సాధించాలి.
తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.