రజతోత్సవ వేళ రంగుమార్చిన గులాబీ నేతలు

సూర్యాపేట జిల్లా:మోతె మండలం సర్వారం గ్రామంలో గులాబీ పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఆదివారం హస్తం గూటికి చేరాయి.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు అకర్షితులై మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

 Pink Leaders Who Changed Colors On The Occasion Of The Silver Jubilee, Pink Lead-TeluguStop.com

బీఆర్ఎస్ నేడు రజతోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే

గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్లు మిక్కిలినేని పురుషత్తంరావు, మేకల గురుకృష్ణ,మాజీ ఎంపీటీసీ ఏలూరి వెంకటేశ్వరరావు, గ్రామశాఖ అధ్యక్షుడు నోముల వెంకన్న,మాజీ ఉప సర్పంచ్లు తిరుమలరావు,నల్లాల శ్రీను తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గద్దె గణేష్,చండూర్ నరసింహ,మండల సోషల్ మీడియా మెంబర్ చావా సాయికృష్ణ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube