Water : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీరు నీళ్లు తక్కువ తాగుతున్నట్టే..!

మన శరీరంలో 70 శాతం నీరు( 70 percent water ) మాత్రమే ఉంటుంది.అయితే శరీరంలో జరిగే ప్రతి పనికి నీరు చాలా అవసరం ఉంటుంది.

 Are These Symptoms Visible But You Are Drinking Less Water-TeluguStop.com

నీరు లేకుండా ఒక వ్యక్తి వారం రోజుల పాటు బతుకుతాడు.అయితే నీరు తాగే పద్ధతులు నియమాలు చాలామందికి తెలిసి ఉండవు.

కాబట్టి ఒక వ్యక్తి తన శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రమే నీటిని తాగాల్సి ఉంటుంది.శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలను విస్మరిస్తే డిహైడ్రేషన్ ( Dehydration ) తీవ్రమైన సమస్యగా మారుతుంది.దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు పెరిగిపోతాయి.

Telugu Skin Dry, Symptoms, Urine-Telugu Health

అలాగే వాటిలో యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్ణం ( Urine infection, constipation, indigestion )మొదలైన సమస్యలు ఎదురవుతాయి.ఇక ముఖంపై మొటిమలు రావడం కూడా ప్రారంభమవుతుంది.నీటి కొరత వలన కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

శరీరంలో నీటి కొరత కారణంగా మూత్రం ముదురు పసుపు రంగులోకి మారిపోతుంది.ఇలాంటి సమయంలో వెంటనే నీరు ఎక్కువగా తాగాలి.శరీరంలో నీరు ఎక్కువగా లేకపోతే విశ పదార్థాలు పెరిగి ముఖంపై మొటిమలు రావడం మొదలైపోతాయి.ఈ సమస్య ఉంటే నీటిని త్రాగడం ప్రారంభించాలి.

అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.శరీరంలో నీరు లేకపోవడం వలన ప్రైవేట్ పార్ట్ లలో దురద, మంట కూడా మొదలవుతుంది.

Telugu Skin Dry, Symptoms, Urine-Telugu Health

దీని వలన మూత్ర విసర్జన సమయంలో మంట మొదలవుతుంది.శరీరంలో నీటి కొరత వలన చర్మం పొడిగా, నిర్జీవంగా ( Skin dry )కూడా మారిపోతుంది.ఇక చిన్న వయసులోనే ముడతలు కూడా ఏర్పడతాయి.శరీరంలో నీరు లేకపోవడం వలన కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా వస్తాయి.ఇక తలలో నిరంతరం నొప్పి కూడా ఉంటుంది.నీటి కొరత కారణంగా శరీరంలోని కండరాలలో నొప్పి, తిమ్మిర్లు, దృఢత్వం లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

అలాగే నీటి కొరత కారణంగా ఒక వ్యక్తి విపరీతమైన అలసట, ఒత్తిడి, గందరగోళానికి గురవుతాడు.కాబట్టి ఎక్కువగా నీరు తాగడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube