పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందా? అయితే ఇలా నివారించుకోండి!

వేస‌వి కాలం వెళ్లి వ‌ర్షాకాలం వ‌చ్చింది.గ‌త కొద్ది రోజుల నుండీ దేశ‌వ్యాప్తంగా చాలా చోట్ల వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి.వరుణుడి ప్రతాపం ఇప్ప‌ట్లో త‌గ్గేలా కూడా క‌నిపించ‌డం లేదు.ఇక ఈ వ‌ర్షాకాలంలో బ‌య‌టకు వెళ్ల‌డానికి చాలా అసౌక‌ర్యంగా ఫీల్ అవుతుంటారు.అయినా త‌ప్ప‌దు.నిత్య‌వ‌స‌ర స‌రుకుల కోస‌మో, అత్య‌వ‌స‌ర ప‌నుల కోస‌మో బ‌య‌ట కాలు పెట్టాల్సిందే.

 Home Remedies To Get Rid Of Foot Fungal Infection Details! Home Remedies, Foot F-TeluguStop.com

అయితే వ‌ర్ష‌పు నీటిలో పాదాలు త‌ర‌చూ త‌డ‌వ‌టం వ‌ల్ల ఒక్కోసారి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంటుంది.

ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా రింగ్‌వార్మ్, దురద, మంట‌ సమస్యలు పాదాలను వేధిస్తాయి.

దాంతో ఆ స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే స‌హ‌జంగానే ఆయా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకుని ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

పాదాలకు సోకిన‌ ఫంగల్ ఇన్ఫెక్ష‌న్‌ను నివారించ‌డానికి యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అందుకోసం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి పాదాల‌కు అప్లై చేయాలి.త‌ద్వారా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్ష‌న్ ను అంతం చేసి దుర‌ద, వంట‌, వాపు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.

Telugu Applecider, Curry, Care, Fungal, Fungus, Tips, Latest, Skin Care, Turmeri

అలాగే మిక్సీ జార్‌లో గుప్పెడు వేపాకులు, గుప్పెడు క‌ల‌బంద ముక్క‌లు, అర స్పూన్ ప‌సుపు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప‌ట్టించి.అర గంట పాటు వ‌దిలేయాలి.ఆపై పాదాల‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.త‌ద్వారా ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లూ న‌యం అవుతాయి.

ఇక ఒక బౌల్‌లో నిమ్మ ర‌సం, వెనిగ‌ర్ స‌మానంగా తీసుకుని బాగా క‌లిపి పాదాల‌కు అప్లై చేయాలి.

ఆరిన తర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క‌డ‌గాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube