పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా సరదాగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి.ఈ పండుగను ఇష్టపడని వారు ఉండరు.
నరకాసురుడు అనే రాక్షసుడిని హతమార్చిన రోజు ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.అలాగే చీకటిని పారద్రోలుతూ వెలుగును తెచ్చే పండుగగా దీపావళిని అభివర్ణిస్తారు.
అందుకే దీపావళి వచ్చిందంటే ఊరూవాడా దీపాలతో వెలిగిపోతుంది.బాణాసంచాలతో ఆకాశం మిరమిట్లు గొలుపుతుంది.
అయితే దీపావళి పండుగ ( Diwali Festival )ఎంత సంతోషాన్ని ఇస్తుందో అజాగ్రత్తగా వ్యవహరిస్తే అంతే బాధను నింపుతుంది.
అందుకే దీపావళి ( Diwali )సంతోషంగా మరియు సేఫ్ గా సాగాలంటే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను అస్సలు మరవకండి.
దీపావళి పండుగ రోజు సరదా మొత్తం సాయంత్రమే ఉంటుంది.టపాసులు కాల్చేందుకు పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహ పడుతుంటారు.అయితే టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.వదులుగా ఉండే దుస్తులు కాకుండా ఒంటిని పట్టి ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
టపాసులను ఇంట్లో కాకుండా ఖాళీ ప్రదేశాల్లో కాల్చుకోవాలి.

పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను ( Tapas )తిరిగి వెలిగించే ప్రయత్నం చేయడం లేదా చేతులతో పట్టుకోవడం వంటివి చేయకూడదు.టపాసులు కాల్చడానికి ముందు ఒక బకెట్ నీళ్లు పక్కన పెట్టుకోవాలి.ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ వాటర్ ఉపయోగపడతాయి.
గాజు, లోహపు పాత్రల్లో పెట్టి టపాసులు కాల్చడం చాలా ప్రమాదకరం.బయట టపాసులు కాల్చే సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి.
చేతిలో పట్టుకుని టపాసులను కాల్చేందుకు అస్సలు ప్రయత్నించకూడదు.

అలాగే టపాసులు కాల్చే సమయంలో చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.పెద్ద పెద్ద సౌండ్స్, ఎక్కువ పొగ వచ్చే టపాసులను కాల్చకపోవడమే మంచిది.వీటివల్ల వినికిడి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మంటలు అంటుకునే అవకాశం గల ప్రాంతాల్లో పొరపాటున కూడా టపాసులు కాల్చవద్దు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే దీపావళి సంతోషంగా సేఫ్ గా సాగుతుంది.
ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే నీటితో మంటలను ఆర్పాలి.మరియు కాలిన గాయాలపై ఐస్ పెట్టడం, వెన్న, పౌడర్ వంటివి రాయడం చేయకూడదు.
వాటర్ తో కడగాలి లేదా తడి క్లాత్ ను చుట్టి వైద్యుడి వద్దకు వెళ్లాలి.







