Varun Tej : రిస్క్ తీసుకుంటున్న కూడా వరుణ్ తేజ్ కి లక్కు కలిసి రావడం లేదు.. పాపం !

మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి వచ్చి, మెగా అండదండలు మెండుగా ఉన్నా కూడా ఎందుకో వరుణ్ తేజ్ ( Varun Tej )మీడియం హీరోగా కూడా సరిగ్గా రాణించలేకపోతున్నాడు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.ఎందుకంటే మీడియం రేంజ్ చిత్రాలు తీస్తున్న హీరోలు అంతా కూడా వరుస పెట్టి విజయాలు సాధిస్తుంటే వరుణ్ తేజ్ ఆ రేసులో వెనుకబడి పోతున్నాడు.

2014లో అంటే దాదాపు పది సంవత్సరాల క్రితం ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు వరుణ్ తేజ్.ఆ తర్వాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, నాన్న కూచి, ఎఫ్ 2, గద్దల కొండ గణేష్, ఘని, ఎఫ్ 3 , గాండీవదారి అర్జున వంటి 13 చిత్రాల్లో నటించాడు.

అయితే ఈ పదేళ్లలో కేవలం 13 సినిమాలు తీసిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) అనే సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఎవరూ చేయనటువంటి ప్రయోగాలు చేశాడు వరుణ్ తేజ్.ముకుంద చిత్రంలో ఒక భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు.అలాగే కంచే సినిమాలో ఆర్మీ సోల్జర్ గా ఎంతో కష్టపడి ఆ సినిమా తీశాడు.

Advertisement

నిజంగా ఒక హీరో ఇలాంటి పాత్రలు తన కెరియర్ మొదట్లో చేయడం అంటే అది సాహసమే.అయినా కూడా అలాంటి పాత్రలు చేసి పరవాలేదు అనిపించుకున్నాడు.ఇక ఫిదా సినిమా విజయవంతం సాధించిన అది ఎక్కువగా సాయి పల్లవి ఖాతాలోకి వెళ్ళిపోయింది.

అంతరిక్షం లాంటి ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించిన అది విజయవంతం కాలేదు.ఇక గద్దల కొండ గణేష్ పర్వాలేదు అనిపించినా ఎఫ్2, ఎఫ్3 సినిమాలు కూడా వెంకటేష్, అనిల్ రావిపూడి ఖాతాలోకి వెళ్లిపోయాయి.

ఇప్పుడు కనీసం ఆపరేషన్ వాలెంటైన్ లాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం అయినా విజయవంతం అవుతుందా లేదా అనేది మెగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.కెరియర్ లో రిస్కు తీసుకోవడానికి వరుణ్ తేజ్ ఎప్పుడు ఇష్టపడతాడు.సినిమా అంటే రిస్క్ లేకుండా ఉండకూడదని భావిస్తాడో ఏమో కానీ యాక్షన్స్ సన్నివేషాల కోసం అయినా లేదంటే భిన్నమైన కథల కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ కూడా కాశ్మీర్లో జరిగిన ఒక దాడి నేపథ్యంలోనే తెరమీదకి వస్తోంది.ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అవుతారు అని వరుణ్ చెబుతున్నాడు కానీ మరి ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   
Advertisement

తాజా వార్తలు