స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh)స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం(F2, F3, Sankranthi Vasthunam) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఈ సినిమా సక్సెస్ తో వెంకీ మామ దశ తిరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వెంకటేశ్ త్రివిక్రమ్(venkatesh trivikram) కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో (Bunny Trivikram combo)మూవీ కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్ వెంకటేశ్ తో సినిమా దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

వెంకటేశ్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.వెంకీ త్రివిక్రమ్ కాంబో (Venky Trivikram combo)మూవీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.వెంకటేశ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ తన సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

వెంకటేశ్ కథల ఎంపికకు సంబంధించి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.వెంకటేశ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.వెంకటేశ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాలి.వెంకీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేయాలని ఆయా స్టార్ హీరోల అభిమానులు భావిస్తుండటం గమనార్హం.