అమ్మ అనే పిలుపు కోసం ప్రతి మహిళా ఆరాటపడుతుంది.అందుకే ప్రెగ్నెన్సీ అనేది పెళ్లైన ప్రతి మహిళ ఒక వరంలా భావిస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో తన కడుపులోని బిడ్డ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇక గర్భం దాల్చిన తర్వాత స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఎన్నో సమస్యలను కూడా ఎదురవుతుంటాయి.
అయితే దాదాపు ప్రెగ్నెన్సీ మహిళలందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి) అని చెప్పాలి.
యూట్రస్ విస్తరించడం మరియు శరీరంలో హార్మోనల్ మార్పుల వల్ల ప్రెగ్నెన్సీ మహిళల్లో బ్యాక్ పెయిన్ వస్తుంటుంది.ఈ సమయంగా వారు చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.
అదే సమయంలో ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.ఖచ్చితంగా బ్యాక్ పెయిన్‌కు చెక్ పెట్టవచ్చు.బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు పది నిమిషాల పాటు నెమ్మది వాకింగ్ చేయాలి.
చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.ఇలా చేయడం వల్ల కండరాలు గట్టిపడి.
నొప్పి తగ్గుముఖం పడుతుంది.బ్యాక్ పెయిన్ ను తగ్గించడానికి మంచి పరుపుపై నిద్రించడం కూడా ముఖ్యం.
ఎందుకంటే.ఒక్కోసారి పరుపు సరిగ్గా లేకపోయినా.
బ్యాక్ పెయిన్ వస్తుంటుంది.
అలాగే బ్యాక్ పెయిన్‌తో బాధపడేవారు బెల్లీ సపోర్ట్ బ్యాండ్ ను వేసుకోవడం కూడా మంచిదే.
తద్వారా వెన్నుపై పడే ఒత్తిడి తగ్గితుంది.అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో హై హీల్స్ అస్సలు వేసుకోకూడదు.
ఎందుకంటే.హై హీల్స్ వేసుకోవడం వల్ల వెన్ను నొప్పి మరియు పాదాల నొప్పులు వస్తుంటాయి.
కాబట్టి, ఈ విషయం లో జాగ్రత్తగా ఉండాలి.ఇక బ్యాక్ పెయిన్ తగ్గడానికి మరో ఉత్తమ మార్గం యోగ.
అవును, ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు యోగా చేయడం వల్ల నొప్పిని తట్టుకునే స్థాయి పెరుగుతుంది.వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.