కేజీఎఫ్3 సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్!

ప్రశాంత్ నీల్( Prashant Neel ) దర్శకత్వంలో సినిమాలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే సినిమా కేజీఎఫ్.ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్.

 Ajith In Kgf Chapter 2 Again Discussions Started, Ajith, Kgf 3, Kollywood Hero,-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇటు ప్రశాంత్ నీల్ కి అలాగే అటు కోలీవుడ్ స్టార్ హీరో అయినా యష్( Yash ) కి భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఇప్పటివరకు ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయిన విషయం తెలిసిందే.అవి రెండూ కూడా ఒకదానిని మించి ఒకటి సక్సెస్ ఫుల్ గా నిలిచాయి.

Telugu Ajith, Kgf, Kollywood, Prashanth Neel-Movie

మాస్ ఎలివేషన్స్ కి పెట్టింది పేరుగా మారిపోయిన ఈ చిత్రాల ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 పై కూడా భారీ హైప్ నెలకొందట.అయితే మరి ఈ సినిమా విషయంలో కొన్నాళ్ల కితం తమిళ బిగ్ స్టార్ థలా అజిత్ ( Tamil big star Thala Ajith )ప్రెజెన్స్ ఉంటుంది అని అలాగే నీల్ అజిత్ తో ఓ సినిమా చేస్తాడు అన్నట్టుగా గట్టి రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.కానీ లేటెస్ట్ గా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కేజీఎఫ్ చాప్టర్ 2 ( KGF Chapter 2 )లో డైలాగ్స్ పేల్చడం ఆసక్తిగా మారింది.దీనితో ఇక్కడ నుంచి మళ్ళీ కేజీఎఫ్ 3 పై డిస్కషన్ మొదలైంది.

పార్ట్ 3 లో థలా ఉండవచ్చు అనే మాటలు మళ్ళీ మొదలయ్యాయి.

Telugu Ajith, Kgf, Kollywood, Prashanth Neel-Movie

మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం దాని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది అని చెప్పాలి.మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలి అంటే మూవీ మేకర్స్ ఈ సినిమా గురించి స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.మరి నిజంగానే వార్తల్లో వినిపిస్తున్నట్టుగా తలా అజిత్ ఈ సినిమాలో నటించబోతున్నారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సిందే.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పాలి.సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోవడం ఖాయం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube