ఒక సినిమా ఆడియోన్స్ ముందుకు రావాలి అంటే చాలా కష్టపడాలి.ఎంతో మంది రాత్రి ,పగలు అని తేడా లేకుండా కష్టపడాలి.
రోజుల తరబడి శ్రమించాలి.హీరోలు కూడా ఎంతో శ్రమ పడితేనే మంచి అవుట్ ఫుట్ బయటకు వస్తుంది.
అలా ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నోసార్లు ప్రమాదాలకు గురయ్యారు టాలీవుడ్ హీరోలు.డేంజరస్ స్టంట్లు చేసి చావు దాకా వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు.
ఇంతకీ సినిమా షూటింగు సమయంలో గాయపడిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
జూ.ఎన్టీఆర్- బృందావనం, అదుర్స్

బృందావనం సినిమా షూటింగ్ స్పాట్ లో జూ.ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యింది.చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.అదుర్స్ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు.అయినా షూటింగ్ కంప్లీట్ చేశాడు.
రామ్ చరణ్-రచ్చ

రచ్చ సినిమాలో రైలు పట్టాలపై ఓ రేస్ ఉంటుంది.ఈ సీన్ షూట్ సమయంలో ప్రమాదం జరిగింది.చిన్న గాయాలతో తప్పించుకున్నాడు.
మంచు మనోజ్-బిందాస్తన స్టంట్లు తానే డిజైన్ చేసుకుంటాడు మనోజ్.బిందాస్ సినిమాలో ఫైట్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు.
అల్లు అర్జున్-ఎవడు

ఎవడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ సీన్ లో అల్లు అర్జున్ గాయపడ్డాడు.
శర్వానంద్-జాను

ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో స్కై డైవింగ్ ట్రయినింగ్ తీసుకున్నాడు.ఈ సమయంలో తన భుజానికి గాయం అయ్యింది.నాగశౌర్య-అశ్వథామఈ సినిమాలో ఒక స్టంట్ చేస్తున్నప్పుడు పలు చోట్ల గాయాలు తగిలాయి.
సందీప్ కిషన్-తెనాలి రామ బీఏ బీఎల్సందీప్ ఈ సినిమా చేస్తన్న సమయంలో గాయపడ్డాడు.ముఖానికి దెబ్బలు తగిలాయి.
ధనుష్-మారి-2

ఈ సినిమాలో ఫైట్స్ చేస్తున్నప్పుడు కుడికాలికి గాయాలు అయ్యాయి.
విశాల్- యాక్షన్గాలిలో ఉన్న బైక్ నుంచి కిందపడ్డాడు విశాల్.అయినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అజిత్-వలిమై

పుల్ యాక్షన్ మూవీ అయిన ఈ సినిమాలో పలుమార్లు గాయపడ్డాడు అజిత్.బైక్ స్టంట్లు చేస్తుండగా జరిగి ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.