ప్రస్తుత సమ్మర్( Summer ) సీజన్ లో ప్రధానంగా వేధించే చర్మ సమస్యల్లో సన్ టాన్( Sun Tan ) ముందు వరుసలో ఉంటుంది.కాసేపు ఎండలో తిరిగారంటే చాలు చర్మ నల్లగా కమలిపోయినట్టు అయిపోతుంది.
టాన్ అయిన స్కిన్ ను రిపేర్ చేసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ముందుగా ఒక టమాటోను( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, నాలుగు పుదీనా ఆకులు( Mint Leaves ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.
వీటితో పాటుగా వన్ టీ స్పూన్ తేనె, వన్ టీ స్పూన్ పెరుగు మరియు సరిపడా టమాటో పుదీనా ప్యూరీ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం ఐస్ క్యూబ్ తో చర్మాన్ని సున్నితంగా రెండు మూడు నిమిషాల పాటు రబ్ చేసుకోవాలి.ఫైనల్ గా వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే ఒక్క వాష్ లోనే ఆల్మోస్ట్ టాన్ మొత్తం రిమూవ్ అవుతుంది.చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.చర్మం అందంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది.అలాగే ఈ రెమెడీని తరచూ ట్రై చేయడం వల్ల స్కిన్ అనేది సూపర్ స్మూత్ గా మారుతుంది.
పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు ఫేస్ స్మూతీగా సైతం మారుతుంది.