అధిక బరువు( Over Weight ) సమస్యతో బాధపడుతున్నారా.? వెయిట్ లాస్ కోసం కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు రోజు చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కచ్చితంగా మీ డైట్ లో ఉండాల్సిందే.ఈ జ్యూస్ మీ బరువు తగ్గే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.
అదే సమయంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూస్తుంది.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు గింజ తొలగించిన కాకరకాయ ముక్కలు( Bitter Gourd ) వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ అల్లం( Ginger ) ముక్కలు, వన్ టీ స్పూన్ పచ్చి పసుపు( Turmeric ) ముక్కలు, ఐదారు పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగేయడమే.
వారానికి రెండు సార్లు ఈ జ్యూస్ ను తాగారంటే మస్తు లాభాలు పొందుతారు.

ముఖ్యంగా ఈ కాకరకాయ జ్యూస్ లో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఈ జ్యూస్ శరీరం చక్కెరను కొవ్వుగా నిల్వ చేయకుండా ఆపుతుంది.మెటబాలిజం రేటును పెంచుతుంది.
శరీరంలోని జిడ్డు కొవ్వును కాల్చుతుంది.అతి ఆకలిని తగ్గిస్తుంది.
ఫలితంగా మీరు మరింత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదండోయ్.
కాకరకాయతో పైన చెప్పిన విధంగా జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కాకరకాయ, అల్లం, పచ్చి పసుపు, పుదీనా, కొత్తిమీరలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి.అలాగే కాకరకాయలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల.ఇది శరీరంలో సోడియంను సమతుల్యం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది.కాకరకాయ జ్యూస్ కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది.దాని పనితీరును మెరుగుపరుస్తుంది.మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా ఈ కాకరకాయ జ్యూస్ కలిగి ఉంటుంది.
కాబట్టి కష్టమైన, ఇష్టం లేకున్న ఆరోగ్యం కోసం వారానికి రెండుసార్లు లేదా కనీసం ఒకసారైనా పైన చెప్పిన విధంగా కాకరకాయ జ్యూస్ ను చేసుకుని తాగండి.