Chandra Mohan: ఒక పక్క తల్లి శవం..అయిన షూటింగ్ పూర్తి చేసిన చంద్ర మోహన్

నవంబర్ 11వ తేదీ ఉదయం 9.45 నిమిషాలకు గుండె సంబంధిత సమస్యలతో దిగ్గజ నటుడు చంద్రమోహన్( Chandra Mohan ) కన్నుమూశాడు.ఆయన మృతి పట్ల తెలుగు, తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.ఒక్క 7g బృందావన కాలనీ సినిమాతోనే అతడు తమిళ ప్రేక్షకులందరినీ తనకు అభిమానులను చేసుకున్నాడు.

 Chandra Mohan: ఒక పక్క తల్లి శవం..అయిన ష�-TeluguStop.com

ఆయన 82 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు.చంద్రమోహన్ వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

మరణించడానికి కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరాడు.

చంద్రమోహన్ అనేక చిత్రాలలో ప్రధాన, సహాయక పాత్రలు పోషించిన బహుముఖ నటుడు.1966లో రంగుల రాట్నం సినిమాతో( Rangula Ratnam Movie ) రంగప్రవేశం చేసి తన కెరీర్‌లో 900కి పైగా చిత్రాల్లో నటించాడు.రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి (1978), రామ్ రాబర్ట్ రహీమ్ (1980), రాధా కళ్యాణం (1981), రెండు రెళ్ళు ఆరు (1986), చందమామ రావే (1987) వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

చంద్రమోహన్ ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోతాడు.ఒక సినిమా ఒప్పుకుంటే అందులోని తన క్యారెక్టర్ కోసం చంద్రమోహన్ ఫుల్ డెడికేషన్ పెడతాడు.

తనవల్ల సినిమాకి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటాడు.

Telugu Chandra Mohan, Chandramohan, Uday Kiran-Movie

అతను ఎంత డెడికేటెడ్ యాక్టర్( Dedicated Actor ) తెలుసుకోవాలంటే ఒక సంఘటన గురించి తెలుసుకుంటే సరిపోతుంది.ఆ సంఘటన ఏంటో తెలుసుకుంటే, చంద్రమోహన్ మనసంతా నువ్వే సినిమాలో( Manasantha Nuvve ) ఉదయ్ కిరణ్‌ను( Uday Kiran ) దత్తత తీసుకున్న ఫాదర్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ సమయంలో చంద్రమోహన్‌కు ఒక దుర్వార్త అందింది.

ఒక సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో అతని తల్లి( Chandra Mohan Mother ) మరణించిందన్న వార్త అతడి చెవిన పడింది.దాంతో అతడిలో దుఃఖం మొదలయ్యింది.

వెంటనే తల్లిని చూసేందుకు వెళ్దాం అనుకున్నాడు కానీ షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్లే ఇష్టం లేక అలానే నటించాడు.కానీ నటించేటప్పుడు ఏమాత్రం దుఃఖం కనిపించకుండా చాలా నేచురల్ గా సన్నివేశానికి తగినట్లుగా నటించాడు.

Telugu Chandra Mohan, Chandramohan, Uday Kiran-Movie

షూటింగ్ పూర్తి చేసిన తర్వాతనే తన తల్లి మృతదేహాన్ని చూసేందుకు బయలుదేరాడు.అప్పట్లో దీని గురించి చాలామంది మాట్లాడుకున్నారు.చంద్రమోహన్ పని పట్ల కమిట్‌మెంట్, డెడికేషన్ ఉన్న గొప్ప నటుడు అని సినిమా వాళ్ళు తెగ ప్రశంసించారు.తర్వాత ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చంద్రమోహన్ కూడా దీని గురించి పెదవి విప్పాడు.

సినిమా షెడ్యూల్‌కు అంతరాయం కలిగించకూడదని అలా చేసినట్లు చెప్పాడు.ఇక ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా, ఇతర వేదికలపై చంద్రమోహన్‌కు సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నారు.

ప్రేక్షకులపై జరగని ముద్ర వేసిన అతి తక్కువ మంది నటులలో చంద్రమోహన్ కూడా ఒకరు అని కామెంట్ చేస్తూ ఎమోషనల్‌ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube