ముఖంపై ఎలాంటి మచ్చ లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు.ఎందుకంటే మచ్చలు అందాన్ని పాడుచేస్తాయి.
చర్మం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్న అక్కడక్కడ కనిపించే మచ్చలు ఎదుటివారికి మనల్ని కాంతిహీనంగా చూపిస్తాయి.అందుకే మచ్చలేని చర్మాన్ని కోరుకుంటారు.
అయితే ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక కారణంతో ముఖంపై మచ్చలు పడుతూనే ఉంటాయి.వీటిని నివారించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ వాష్ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

రెగ్యులర్గా ఈ ఫేస్ వాష్ ను కనుక వాడితే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు రోజ్ వాటర్ తో పాటు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బేబీ వాష్ ను వేసుకొని మరోసారి కలుపుకోవాలి.
అంతే మన హోమ్ మేడ్ ఫేస్ వాష్ సిద్ధం అయినట్టే.ఈ ఫేస్ వాష్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ ఫేస్ వాష్ ను వాడటం వల్ల చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.

పసుపు, తేనె, అలోవెరా జెల్ మరియు రోజ్ వాటర్ లో ఉండే పలు సుగుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.మచ్చలేని చర్మాన్ని మీ సొంతం చేస్తాయి.అలాగే ఈ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను ఉపయోగించడం వల్ల మొటిమలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ స్మూత్ గా షైనీ గా మారుతుంది.
ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం ఫ్రెష్ గా గ్లోయింగ్ గా మెరుస్తుంది.







