ప్రతి స్టార్ హీరో తన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం సాధారణంగా జరుగుతుంది.అయితే అలా రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే కొన్నిసార్లు హీరోలు ఫీలవుతూ ఉంటారు.
అలా హీరో రామ్ చరణ్ సినీ కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమా ఏదనే ప్రశ్నకు శ్రీమంతుడు సినిమా( Srimanthudu movie ) పేరు జవాబుగా వినిపిస్తోంది.చరణ్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కాల్సిన ఈ సినిమా మహేష్ కొరటాల శివ( Koratala Shiva ) కాంబోలో తెరకెక్కింది.
రామ్ చరణ్( Ram Charan ) సినీ కెరీర్ విషయానికి వస్తే గత మూడేళ్లుగా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతోనే బిజీగా ఉన్నారు.వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాదే గేమ్ ఛేంజర్ రిలీజవుతుందని దిల్ రాజు చెబుతున్నా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలను అభిమానులు నమ్మే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
చరణ్ ,బుచ్చిబాబు కాంబో సినిమా త్వరలో మొదలుకానుండగా ఈ సినిమ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియాలో రామ్ చరణ్ మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ చరణ్ క్రేజ్ పెంచుకుంటున్నారు.100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్న చరణ్ ప్రయోగాత్మక సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.