తాజాగా పంజాబ్ రాష్ట్రం( Punjab )లో దారుణ సంఘటన చోటు చేసుకుంది.శివసేన నేతను నిహాంగులు కత్తులతో తలపై, చేతులపై అందరూ ఉండగానే నడిరోడ్డు మీద దాడి చేశారు.
దాడిలో గాయపడిన శివసేన నేతను కొందరు ఘటన తర్వాత ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పక్కనే ఉన్న సిసికెమెరాలో సంఘటన మొత్తం రికార్డు అవ్వగా.
అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.లూథియానా ప్రాంతానికి చెందిన పంజాబ్ శివసేన నేత సందీప్ ఖలిస్థాన్( Khalistan )కు వ్యతిరేకంగా మాట్లాడారు.
దాంతో ఆగ్రహించిన నిహాంగులు ఆయనపై కత్తులతో దాడికి యత్నం చేశారు.
శుక్రవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యక్రమం ముగించుకొని తన స్కూటర్ పై వెళ్తున్న సందీప్ ( Sandeep )ను నడిరోడ్డుపై నిహాంగులు అడ్డుకున్నారు.ఆ తర్వాత ఆయనతో వాగ్వాదానికి దిగారు.అయితే ఆ సమయంలో అతనితోపాటు ఉన్న గన్ మెన్ అక్కడ నుంచి పారిపోయాడు.
అయితే సందర్భాన్ని గ్రహించిన సందీప్ తనను విడిచిపెట్టాలని చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు.అయినా గాని ఎటువంటి కనికరం చూపించకుండా నిహాంగులు సందీప్ తల, చేతులపై తీవ్రంగా కత్తులతో దాడి చేశారు.
దీంతో అతను స్కూటర్ మీద నుంచి కిందికి పడిపోయాడు.అలా కత్తులతో ఆయనపై దాడి చేసిన గా తర్వాత స్కూటర్ పై నిహాంగులు అక్కడ నుంచి పారిపోయారు.
దాంతో తీవ్రంగా గాయపడిన సందీప్ ను ఆస్పత్రికి తరలించారు అక్కడివారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ విషయంపై లూథియానా పోలీసులు హత్యాయత్నం చేసినట్లుగా కేసును నమోదు చేశారు.వీలైనంతవరకు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.