ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న జుట్టు నిత్యం ఊడిపోతుంటే ఎంత బాధ కలుగుతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ఒత్తైన జుట్టు( Thick Hair ) మనల్ని మరింత అట్రాక్టివ్ గా చూపిస్తుంది.
కానీ అదే జుట్టు పల్చగా మారిపోతే గ్లామర్ మొత్తం ఎగిరిపోతుంది.అందుకే జుట్టు అధికంగా రాలుతుందంటే తెగ హైరానా పడిపోతూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యతో మీకు టెన్షన్ అవసరం లేదు.జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు మన వంట గదిలో ఉంది కాఫీ పౌడర్( Coffee Powder ) అద్భుతంగా తోడ్పడుతుంది.మరి ఇంతకీ కాఫీ పౌడర్ ను ఉపయోగించి హెయిర్ ఫాల్ ను ఎలా ఖతం చేయవచ్చో తెలుసుకుందాం పదండి.
![Telugu Aloevera Gel, Caffeine, Coffee Powder, Coffeepowder, Care, Care Tips, Fal Telugu Aloevera Gel, Caffeine, Coffee Powder, Coffeepowder, Care, Care Tips, Fal](https://telugustop.com/wp-content/uploads/2024/11/How-to-stop-hair-fall-with-coffee-powder-detailsd.jpg)
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి, అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) రెండు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే మంచి లాభాలు పొందుతారు.
![Telugu Aloevera Gel, Caffeine, Coffee Powder, Coffeepowder, Care, Care Tips, Fal Telugu Aloevera Gel, Caffeine, Coffee Powder, Coffeepowder, Care, Care Tips, Fal](https://telugustop.com/wp-content/uploads/2024/11/How-to-stop-hair-fall-with-coffee-powder-detailss.jpg)
కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్( Caffeine ) జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.అదే సమయంలో జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.కెఫిన్ నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఇది వేగంగా మరియు మెరుగైన జుట్టు పునరుత్పత్తికి దారితీస్తుంది.అలాగే కాఫీ పౌడర్ మీ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.నెత్తిపై డెడ్ స్కిన్ సెల్స్, మురికి మరియు మలినాలను తొలగిస్తుంది.
చుండ్రు నివారణకు కూడా కాఫీ పౌడర్ మద్దతు ఇస్తుంది.అంతేకాకుండా కాఫీ సహజమైన హెయిర్ డైలా పనిచేస్తుంది.
నెరిసిన జుట్టును కాఫీ పౌడర్ నల్లగా మారుస్తుంది.కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టులో తేమను నిలుపుకోవడంలో సైతం సహాయపడతాయి.