బొప్పాయి పండు( Papaya ) తినడం ఆరోగ్యానికి మంచిదని దాదాపు చాలా మందికి తెలుసు.ఈ పండు పొట్టకు ఎంతో మేలు చేస్తుంది.
దీన్ని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.ఈ పండును తినడం వల్ల డయాబెటిస్( Diabetes ) నియంత్రణ, యాంటీ ఏజింగ్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అలాగే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కానీ అది తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదు.
ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయిని తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.బొప్పాయి తిన్న తర్వాత పాలు, పెరుగు, చీజ్, వెన్న మొదలైన పాల ఉత్పత్తులను అస్సలు తినకూడదు.
బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు పాల ఉత్పత్తులను జీర్ణం చేయలేవు.

అలాగే బొప్పాయి తిన్న తర్వాత పాల ఉత్పత్తులను( Milk Products ) తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది.దీని వల్ల గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.ఇంకా చెప్పాలంటే బొప్పాయి తిన్న తర్వాత దోసకాయ అసలు తినకూడదు.
దోసకాయలో( Cucumber ) నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల కడుపులో నీరు పేరుకుపోతుంది.
ఇది అపానవాయు, పొట్ట ఉబ్బరం, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.బొప్పాయి తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మందగిస్తుంది.

బొప్పాయి తిన్న తర్వాత నీరు త్రాగాలనుకుంటే గోరు వెచ్చని నీళ్లను తాగడం మంచిది.ఇంకా చెప్పాలంటే బొప్పాయి తిన్న తర్వాత గుడ్లు( Eggs ) తినకూడదు.గుడ్లు తినడం వల్ల మన మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు కలుగుతాయి.అలాగే బొప్పాయి తిన్న తర్వాత ఎలాంటి ఆమ్లా ఆహారాన్ని తీసుకోకూడదు.ఇది గుండెల్లో మంట, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.బొప్పాయి తిన్న తర్వాత వీటిలో ఏ ఒక్క ఆహార పదార్థాన్ని తీసుకున్న మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.