తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఏవి సక్సెస్ సాధించక పోయినప్పటికి ఆయన సినిమాలను చేస్తూ ముందుకు సాగే ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన కథ మాటలు అందించిన ఓదెల 2( Odela 2 ) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులు మెప్పించలేక పోయింది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో తమన్నా( Tamanna ) నటించినప్పటికి ఆమె పాత్రకి అంత పెద్ద స్కోప్ అయితే లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.తద్వారా ఈ సినిమాతో తమన్న తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో ఆమె స్టార్ హీరోల పక్కన సినిమాలను చేసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలో ఆమె ఇపంటి సినిమాలు చేసి తన ఇమేజ్ ను సైతం పోగొట్టుకుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తమన్నా లాంటి నటి సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేసింది.మరి ఈ సినిమా ద్వారా ఆమె ఒక బ్యాడ్ నేమ్ అయితే మూట గట్టుకుందనే చెప్పాలి…ఇక సంపత్ నంది( Sampath Nandi ) కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడు.కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగితే బాగుంటుంది కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.