ఈమధ్య చాలామంది మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.ఎక్కువ మందిలో థైరాయిడ్ సమస్య( Thyroid ) కనిపిస్తుంది.
అయితే కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉందని కూడా గుర్తించలేరు.ఎందుకంటే ఎలాంటి సంకేతాలు కనిపించవు.
అయితే సమస్య ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.థైరాయిడ్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
వచ్చిన కూడా దాన్ని ఎలా తగ్గించుకోవాలి.? అది కూడా ఇంట్లో దొరికే పదార్ధాలతో, హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందా.? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.ముఖ్యంగా థైరాయిడ్ రెండు టైప్స్ ఉంటాయి.
హైపోథైరాయిడ్స్, హైపర్ థైరాయిడ్.వీటి లక్షణాలు గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వనకడం లాంటివి కనిపిస్తాయి.
ఈ రెండింటి సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ హోమ్ రెమెడీని పాటించాల్సిందే.దీంతో తప్పకుండా థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
ముందుగా ఏం చేయాలంటే ఒక స్పూన్ ధనియాలు( Coriander ) తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి.ఇలా నానబెట్టుకున్న తర్వాత మరొక గిన్నెలో మార్చి స్టవ్ వెలిగించి చక్కగా కాషాయం కాచుకోవాలి.

ఇలా కాషాయం చేసిన తర్వాత దాన్ని వడగట్టుకుని ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.ఇలా ప్రతిరోజు చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్ లోకి వస్తుంది.ఇక ప్రతిరోజు ఆహారంలో ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయ తినడం వలన కూడా చాలా మంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే వాల్నట్ ఆయిల్ ను ఉపయోగించడం వలన కూడా థైరాయిడ్ సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఇది కొంచెం ఖరీదైనప్పటికి కూడా ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చు.దీనిని వాడడం వలన ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చు.

అయితే ముందుగా ఈ ఆయిల్ తో గొంతు దగ్గర అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.దీంతో థైరాయిడ్ నుండి ఉపశమనం లభిస్తుంది.అలాగే ఒక ఉల్లిపాయని చక్కగా రసం చేసుకొని ఆ రసంతో కూడా మసాజ్ చేసుకోవచ్చు.పచ్చి ఉల్లిపాయ రసంతో గొంతు దగ్గర మసాజ్ చేసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
అందుకే తప్పకుండా ఈ రెండు చిన్న హోమ్ రెమెడీస్ పాటించడం వలన, అలాగే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్యల్ని అధిగమించవచ్చు.