డాన్స్ మూవ్స్ తో మైఖేల్ జాక్సన్ నే మించిపోయాడుగా! వైరల్ వీడియో

సోషల్ మీడియా రాగానే ప్రతిభకు వేదికలు విస్తరించిపోయాయి.ఓవర్‌ నైట్‌ లో ఎవరు వైరల్( Viral ) అవుతారో చెప్పలేం.

 Street Dancer Stuns Crowd With Michael Jackson Moves Viral Video Takes Internet-TeluguStop.com

ముఖ్యంగా డ్యాన్స్, మ్యూజిక్, స్టంట్ వీడియోలు అనేక మంది యువతకు గుర్తింపును తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.టాలెంట్( Talent ) ఉన్న వాళ్లకు ఏ పెద్ద స్టేజీ అవసరం లేకుండా, రోడ్డుమీదే వారిని ప్రపంచానికి చూపించే అవకాశం ఇప్పుడు సోషల్ మీడియా కల్పిస్తోంది.

అలాంటిదే తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్( Michael Jackson ) స్టైల్లో ఓ యువకుడు చేసిన డ్యాన్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

మూన్ వాక్‌, రోబోట్‌, యాంటీ గ్రావిటీ లీన్ లాంటి క్లాసిక్ మైఖేల్ స్టెప్పులను ఈజీగా చేసి చూపించి ఆశ్చర్యాన్ని కలిగించాడు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఓ యువకుడు నడి వీధిలో రద్దీ రోడ్లపై తన సూపర్ స్ట్రిట్ డ్యాన్స్‌తో( Street Dance ) ప్రేక్షకులను కట్టిపడేశాడు.అతని రోబోటిక్ మూవ్స్, మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ అచ్చుగుద్దినట్లే ఉండడంతో అక్కడే ఉన్న జనాలు షాక్‌కు గురయ్యారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలాంటి చేసందుకే కాదు.

చూసేందుకు కూడా గట్స్ కావాలని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు అతనో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు ఈ యువకుడికి కచ్చితంగా మంచి గుర్తింపు రావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ అద్భుతమైన టాలెంట్ ఎవరిదీ? ఎక్కడ నుంచి వచ్చాడు? అన్న విషయాలు మాత్రం ఇంకా బయటపడలేదు.కానీ అతని డ్యాన్స్ స్టెప్పులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.ఇలాంటి వైరల్ డ్యాన్స్ వీడియోలు నేటి యువత టాలెంట్‌కు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.

వాటి ద్వారా వారికి ప్రపంచ వేదికలు కూడా లభిస్తున్నాయి.ఈ వీడియో కూడా అలాంటి విజయ ప్రయాణానికి నాంది కావాలని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube