ఈ సింపుల్ చిట్కాల‌తో సన్ ట్యాన్‌కు చెక్ పెట్టేయండిలా!

స‌న్ ట్యాన్‌.కేవ‌లం స‌మ్మ‌ర్‌లోనే కాదు అన్ని సీజ‌న్స్‌లోనూ ఈ స‌మ‌స్య వేధిస్తుంది.

 Home Remedies For Reducing Tanning Of Skin! Home Remedies, Tanning, Skin Care, L-TeluguStop.com

అయితే వేస‌వి కాలం మాత్రం ఇవి మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.ఈ విష‌యం ప‌క్కన పెడితే.

ట్యానింగ్ కార‌ణంగా ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బంది ప‌డ‌తారు.ఎండలో ఎక్కువ సమయం ఉంటే.

యూవి కిరణాలు నేరుగా చర్మం మీద పడి చర్మ కణాలు డ్యామేజ్ చేస్తాయి.ఫ‌లితంగా, చర్మం నల్లగా మారుతుంది.

దీనిని స‌న్ ట్యాన్ అంటారు.ఈ క్ర‌మంలోనే ట్యానింగ్ పోగొట్టుకునేందుకు పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతారు.

కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే.సుల‌భంగా ట్యానింగ్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్ట‌డంలో బంగాళ‌‌దుంప గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక బంగాళ‌దుంప తీసుకుని మొత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి చ‌ర్మానికి అప్లై చేయాలి.

బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో చ‌ర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే.

న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది.

Telugu Tan, Tips, Face, Latest, Skin Care, Sun Tan-Telugu Health - తెలు�

ఇక టమోటా కూడా స‌న్ ట్యాన్‌ను నివారిస్తుంది.ఒక బౌల్‌లో ట‌మాటా పేస్ట్‌, పెరుగు మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ట్యానింగ్ అయిన ప్రాంతాల్లో అప్లై చేసి.

అర‌గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల ట్యానింగ్ స‌మ‌స్య దూరం అవుతుంది.

అలాగే ఒక బౌల్‌లో బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు మ‌రియు తేనె వేసి.మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా స‌న్ ట్యాన్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube