ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఒకప్పుడు విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన సినిమాలను థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
కొన్ని సినిమాలు విడుదల అయి కొన్ని ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేస్తే మరికొన్ని సినిమాలను ఆయా హీరో హీరోయిన్ల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు.ఇటీవల కాలంలో వారానికి ఒక్క సినిమా అయినా రీ రిలీజ్ అవుతూనే ఉంది.
అందులో భాగంగానే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన ఆది,అదుర్స్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా యమదొంగ రీ రిలీజ్( Yamadonga Re-release ) చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.యమదొంగ సినిమాని మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు( NTR Birthday ) సందర్భంగా మే 18న రీ రిలీజ్ చేస్తున్నారట.మే 18 నుంచి 20 వరకు మూడు రోజులు థియేటర్స్ లో ఈ సినిమా ఆడనుందట.
రాజమౌళి సొంత నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించారు.ఇప్పుడు మైత్రి మూవీస్ రీ రిలీజ్ చేస్తోంది.
దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజుని థియేటర్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోడానికి ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోతున్నారు.

కాగా ఎన్టీఆర్, ప్రియమణి జంటగా మోహన్ బాబు( Mohan Babu ) యముడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది యమదొంగ.ఈ సినిమా 2007 లో రిలీజయి మంచి హిట్ అయింది.ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో యముడిగా అలరించి మెప్పించాడు.
ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా రీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలలో వార్ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.