1.అసని తుఫాన్ ఎఫెక్ట్

ఏపీలో అసని తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా తీర ప్రాంతంలో అల్లకల్లోలం ఏర్పడింది.కోనసీమ జిల్లాల తీరం వెంబడి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
2.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,288 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
3.పోలీసుల అదుపులో మాజీ మంత్రి నారాయణ

మాజీ మంత్రి నారాయణ ను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
4.బీజేపీ ధర్నా
హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ధర్నా కు దిగారు.గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిజేపి నాయకులు ధర్నాకు దిగారు.
5.కొనాపుర్ గ్రామాన్ని సందర్శించిన కేటీఆర్

బేబీ పేట మండలం గ్రామాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు.
6.హరీష్ రావు పర్యటనలో ఉద్రిక్తత
మంత్రి హరీష్ రావు మహబూబాబాద్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.మెడికల్ కళాశాల భూనర్వాసితులు హరీష్ రావు పర్యటన ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
7.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలక మార్పులు

రోగి ఏ సమయంలో ఆస్పత్రికి వచ్చిన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం దృష్టి పెడుతోంది ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపి తెరిచి ఉంచే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
8.సోము వీర్రాజు కామెంట్స్
ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
9.నారాయణ అరెస్ట్ పై టిడిపి విమర్శలు

మాజీ మంత్రి నారాయణ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని టిడిపి నేత బుద్ధా వెంకన్న అన్నారు.
10.జగన్ తో మంత్రి బొత్స భేటీ
ఏపీ సీఎం జగన్ తో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.
11.అచ్చెం నాయుడు కామెంట్స్

మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులు అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు.
12.రేపటి నుంచి చిన్న వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు
ద్వారకా తిరుమల వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
13.గుడివాడలో టిడిపి ర్యాలీ
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అడ్డగోలు మట్టి తవ్వకాలు ఖండిస్తూ వీధుల్లోకి టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.
14.నేటి నుంచి పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు

నేటి నుంచి తిరుమల లో పద్మావతి అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి రెండు రోజులపాటు ఈ ఉత్సవాలను టిటిడి నిర్వహించనుంది.
15.రెవెన్యూలో ‘ కె ఆర్ ఆర్ సి ‘ పోస్టుల కొనసాగింపు
రెవెన్యూ శాఖలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు కోసం ఏర్పాటు చేసిన పోస్టులను మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
16.ఎమ్మెల్యే ఆళ్ల పై కేసు కొట్టివేత

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది.
17.కెసిఆర్ కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లేఖ రాశారు.విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని ఈ లేఖలో కోరారు.
18.జగన్ ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

ఏపీ సీఎం జగన్ ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.భువనేశ్వర్ లో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి రావాలని జగన్ ను సుబ్బారెడ్డి కోరారు.
19.మాజీ మంత్రి నారాయణ పై మరో కేసు

మాజీ మంత్రి నారాయణ పై ఏపీ సిఐడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఫిర్యాదు తో రాజధాని అమరావతి కి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
20.తెలంగాణలోని పొలిటికల్ పార్టీ ల డిబేట్
ఈనెల 28న అమెరికాలో కీలక తెలంగాణ రాజకీయ డిబేట్ జరగబోతోంది.
ఈ డిబేట్ లో తెలంగాణలోని రాజకీయ పార్టీల అగ్రనేతలు పోతున్నట్లు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలిపింది.