టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా పోకిరి.( Pokiri ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
అంతేకాకుండా హీరో మహేష్ బాబు కి భారీగా గుర్తింపు తెచ్చి పెట్టింది.ఈ సినిమాలో పండుగాడు అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ మర్చిపోలేరు అభిమానులు.పూరీ జగన్నాథ్(
Puri Jagannath ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.2006 సమ్మర్ లో వచ్చిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.అంతేకాకుండా భారీగా వసూళ్లను కూడా సాధించింది.

తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులన్నీ చెరిపేసి, న్యూ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది.ఎన్ని సంచలనాలు సృష్టించిన పోకిరి కో రైటర్( Pokiri Co-Writer ) ఎవరనే అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.ఏప్రిల్ 28వ తేదీకి ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు పూర్తవుతుంది.
ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే మనలో చాలామందికి పోకిరి సినిమాకి కో రైటర్ ఎవరు అన్న విషయం తెలియదు.
అయితే ఈ సినిమాకి కో రైటర్ గా పనిచేసినది మరెవరో కాదు దర్శకుడు మొహర్ రమేష్.( Director Meher Ramesh ) కెరీర్ ప్రారంభంలో పూరీ జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన మెహర్.

పోకిరి టీంలోనూ భాగమయ్యారట.రైటింగ్ విభాగంలో కూడా పని చేసారట.టైటిల్ కార్డ్స్ లో స్క్రిప్ట్ అసోసియేట్ అని క్రెడిట్ ఇచ్చారు.నిజానికి పోకిరి సినిమాకి ముందుగా కృష్ణ మనోహర్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ పెడదామని పూరీ అనుకున్నారట.
అయితే ట్విస్ట్ ఆడియన్స్ కి తెలిసిపోతుందని చెప్పిన మెహర్ రమేష్ పోకిరి టైటిల్ పెట్టమని సూచించారట.అలానే సినిమాలో బాగా పాపులర్ అయిన కొన్ని డైలాగ్స్ వెనుక మెహర్ కలం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతాదో వాడే పండుగాడు డైలాగ్ కూడా మెహర్ రాసాడని అనేవాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి మెహర్ టాలీవుడ్ లో డైరెక్టర్ గా సక్సెస్ అందుకోలేకపోయారు.