తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం సత్తా చాటుకుంటున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి అప్పటి స్టార్ హీరోలు అయినా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.
వీళ్ళలో ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి ముగ్గురు కూడా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక నాగార్జున( Nagarjuna ) కొంతవరకు వెనకబడిపోతున్నాడనే చెప్పాలి.ప్రస్తుతం ఆయనకి సంబంధించిన సినిమాలు ఏమీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా ఆడడం లేదు.
అందువల్లే ఆయన గురించి జనాల్లో పెద్దగా చర్చ అయితే జరగడం లేదు.మరి ఇకమీదట కూడా ఆయన మంచి సినిమాలను చేస్తే ఆయన మార్కెట్ అనేది పదిలంగా ఉంటుంది.
అలా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ వెళ్తే మాత్రం అయనను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే గుర్తిస్తారు తప్ప స్టార్ హీరోగా గుర్తించరు.అనే ఒక కామెంట్స్ అయితే విమర్శకులు చేస్తున్నారు.
మరి ఈ విషయాన్ని నాగార్జున గుర్తుంచుకొని తన వందో సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎలాగైనా సరే తన వందో సినిమాతో 300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాలని పాన్ ఇండియా( Pan India ) సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటివరకు చాలామంది దర్శకులు అతనికి కథలు చెబుతున్నప్పటికి ఏ కథను కూడా ఫైనల్ చేసినట్టుగా కనిపించడం లేదు.ఒకానొక సందర్భంలో లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికి వాటిలో కూడా నిజం లేదు అంటూ నాగార్జున టీం నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి…