చైనా అమ్మాయి మనసు బంగారం.. తమిళనాడు వ్యాపారవేత్తకు రూ.30 లక్షల కారు బహుమతి..

ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.తమిళనాడుకి( Tamil Nadu ) చెందిన ప్రవీణ్ గణేషన్( Prawin Ganeshan ) అనే బిజినెస్ మేన్ ఇప్పుడు లగ్జరీ BMW కారుకి ఓనర్ అయిపోయాడు.

 Indian Entrepreneur Shows Off Bmw Gift From Chinese Friend Details, Prawin Ganes-TeluguStop.com

అసలు విషయం ఏంటంటే, ఆ కారుని ఆయన కొనుక్కోలేదు.చైనాలో( China ) ఉన్న ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్‌గా ఇచ్చింది.

ఈ విషయాన్ని స్వయంగా ప్రవీణ్ గణేషన్ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి మరీ చెప్పాడు.

ఇంతకీ ఆ గిఫ్ట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా, తమిళ సంవత్సరాది రోజున.

అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ అదిరిపోయే గిఫ్ట్ అతడి ఇంటికి వచ్చింది.గణేషన్ ఈ గిఫ్ట్ వెనుక ఉన్న కథను కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో చెప్పాడు.

గత సంవత్సరం తన పుట్టినరోజున ఆయన చైనా వెళ్ళాడంట.ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి అక్కడే జరిగింది.

అక్కడ అర్ధరాత్రి 12 గంటలకు తన ఫ్రెండ్ తన కోసం స్పెషల్ కేక్ తెప్పించి బర్త్‌డే సెలెబ్రేషన్స్ చేసిందంట.

అప్పుడే తన ఫ్రెండ్ గణేషన్‌ను ఒక ప్రశ్న అడిగింది.“నీకు ఇంకా నెరవేరని కల ఏమైనా ఉందా?” అని అడిగిందట.అందుకు గణేషన్ తనకు BMW కారు కొనాలని చాలా కాలం నుండి డ్రీమ్ ఉందని చెప్పాడు.దాంతో వెంటనే ఆ ఫ్రెండ్ ఒక ప్రామిస్ చేసింది.“నీ నెక్స్ట్ బర్త్‌డే లోపు నువ్వు సొంతంగా BMW కారు డ్రైవ్ చేస్తావు” అని చెప్పిందంట.

ఆ ఫ్రెండ్ చెప్పిన మాటని అనుకున్న టైమ్ కంటే ముందే నిజం చేసింది.తమిళ సంవత్సరాది రోజున గణేషన్‌కు మెసేజ్ చేసిందట.“నీ డ్రీమ్ కారు రెడీగా ఉంది, వచ్చి తీసుకెళ్లు” అని చెప్పింది.గణేషన్ వెంటనే వెళ్లి BMW iX1 కారుని డెలివరీ తీసుకున్నాడు.

ఆ ఫోటోలనే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇంకో విషయం ఏంటంటే, ఈ కారు చైనాలోనే ఉంది.ఇండియాకి తీసుకురాలేదు.చైనాలో తన బిజినెస్ పనులు చూసుకునేటప్పుడు ఈ కారుని యూజ్ చేస్తానని గణేషన్ చెప్పాడు.అక్కడ ఈ కారు ధర 2.5 లక్షల యువాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 30 లక్షల రూపాయలు.

గణేషన్ తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.తను సెక్స్ టాయ్స్ బిజినెస్ (Kamakart.com) చేస్తున్నందుకు చాలామంది తనని వెక్కిరించారని చెప్పాడు.

కానీ ఇప్పుడు తను సాధించిన సక్సెస్ వాళ్లందరికీ సమాధానం అని ఫీల్ అవుతున్నాడు.BMW కారు గిఫ్ట్ ఇచ్చిన ఫ్రెండ్ బిజినెస్ పార్టనర్ కాదని, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా క్లారిటీ ఇచ్చాడు.

మొత్తానికి చైనా అమ్మాయి స్నేహానికి, మనసుకి ఫిదా అయిపోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube