ఉత్తరప్రదేశ్ రాష్ట్రం( Uttar Pradesh ) జలౌన్ జిల్లాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.కౌథండ్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( CHC ) లో పనిచేసే డాక్టర్ సురేష్ చంద్ర( Dr.
Suresh Chandra ) అనే ప్రభుత్వ డాక్టర్, ఏకంగా నాలుగేళ్ల పిల్లాడికి సిగరెట్( Cigarette ) తాగించి వింత చికిత్స చేశాడు.ఆ డాక్టర్ ఏమన్నాడంటే.
ఆ పిల్లాడి దగ్గు( Cough ) తగ్గడానికి సిగరెట్ పొగ పీల్చమని చెప్పాడంట.ఇది వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తోంది.
సుమారు 15 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని సమాచారం.పేషెంట్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లాడిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.వాళ్లు డాక్టర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు, పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు.ఆ సమయంలో డాక్టర్ సురేష్ చంద్ర, పిల్లాడికి దగ్గు ఉందని తెలుసుకొని వెంటనే ఒక సిగరెట్ తీసి ఇచ్చాడు.
అంతేకాదు, సిగరెట్ తాగితే దగ్గు తగ్గిపోతుందని చెప్పాడంట.షాకింగ్ విషయం ఏంటంటే, ఆ డాక్టర్ మత్తులో ఉన్నట్లు కూడా అనిపిస్తోంది.
వీడియోలో డాక్టర్ సురేష్ చంద్ర సిగరెట్ వెలిగించి ఆ పిల్లాడికి ఇస్తున్నాడు.“ఖీంచో, ఖీంచో, ఔర్ ఖీంచో” అంటూ పొగ ఎలా పీల్చాలో కూడా నేర్పిస్తున్నాడు.“అందర్ ఖీంచో యార్” అంటూ తానే ముందు ఒక పఫ్ కొట్టి మరీ చూపిస్తున్నాడు.అక్కడున్న ఎవరో ఈ తతంగాన్ని మొబైల్‌లో వీడియో తీశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్( Viral ) అయిపోయింది.జనాలు ఒక్కసారిగా మండిపడ్డారు.
వీడియో వైరల్ కావడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) ఎన్.డి.శర్మ వెంటనే డాక్టర్ సురేష్ చంద్రను బదిలీ చేశారు.అంతేకాదు, ఈ ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించి, అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ACMO)తో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేశారు.
పోలీసులు కూడా ఈ వీడియోను సీరియస్‌గా తీసుకుని విచారణ మొదలుపెట్టారు.