Milk Products : పాల ఉత్పత్తులు ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది..?

ముఖ్యంగా చెప్పాలంటే పాలు,పాల ఉత్పత్తులు( Milk products ) ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి.ముఖ్యంగా ఇవి ఎముకల ఆరోగ్యాన్ని నిర్మించడంలో సహాయపడతాయి.

 How Much Milk Products Should Be Consumed-TeluguStop.com

పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.అవి దృఢమైన, బలమైన ఎముకలను నిర్మించడం లో సహాయపడతాయి.

అలాగే పండ్లు, కూరగాయలతో పాటు పాల ఉత్పత్తులను కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.ఇది అధిక రక్తపోటు( high blood pressure ) ప్రమాదాన్ని నివారిస్తుంది.

పేగుల ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం.పాల నుంచి జున్ను, పెరుగు, లస్సీ, నెయ్యి వెన్నలాంటి ఆహారాన్ని తయారు చేస్తారు.

కానీ నెయ్యి, వెన్న, జున్ను ఎక్కువగా తినడం చాలా ప్రమాదకరం.కాబట్టి ఏ ఆహారం తింటే ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోవాలి.

Telugu Cheese, Curd, Ghee, Pressure, Milkproducts, Lassi, Milk Products-Telugu H

అప్పుడే ఆహారం సమతుల్యంగా ఉంటుంది.పుల్లని పెరుగు నుండి పోషకాహారం లభిస్తుంది. పుల్లటి పెరుగు( Sour curd ) తింటే జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.వెన్న లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.సంతృప్తి కొవ్వులు కూడా ఉంటాయి.అందుకే తక్కువ మోతాదులో వెన్న తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

వంటలలో వెన్న, నెయ్యిని ఉపయోగించవచ్చు.నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

నెయ్యిలో అధిక మొత్తంలో కొవ్వు, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు చాలా మేలు చేస్తాయి.

Telugu Cheese, Curd, Ghee, Pressure, Milkproducts, Lassi, Milk Products-Telugu H

అలాగే ఆహారంలో కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరగవు.క్యాల్షియం ప్రోటీన్లతో( calcium proteins ) పాటు పెరుగులో ప్రోబయోటిక్స్ కూడా అధికంగా ఉంటాయి.ఈ ఆహారం పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అలాగే పుల్లటి పెరుగు జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి కూడా సహాయపడుతుంది.అలాగే ఓట్స్, పండ్ల ను పుల్లని పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.అలాగే స్మూతీ లాగా తయారు చేసుకుని తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube