టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఒకరు.కృష్ణ వారసుడిగా బాల నటుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ప్రస్తుత హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలను కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమైనప్పటికీ మహేష్ బాబుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ క్రేజ్ ఉందని చెప్పాలి .ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ప్రస్తుతం ఈ సినిమా చాలా సైలెంట్ గా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.మరి రాజమౌళి ఇచ్చిన వార్నింగ్( Rajamouli Warning ) ఏంటి అసలు ఎందుకు తనని హెచ్చరించారనే విషయానికి వస్తే… స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు సినిమాల పరంగా చాలా నిబద్ధతతో పనిచేస్తారట ఎలా అంటే సినిమాలలో ఎలాంటి యాక్షన్ సన్ని వేషాలు అయినా కూడా డూప్ లేకుండా తానే నటించే అలవాటు మహేష్ బాబుకి ఉందట.ఈ విషయంలో గతంలో కూడా కృష్ణ ఎన్నోసార్లు తనని హెచ్చరించిన మహేష్ మాత్రం తన ధోరణిని మార్చుకోలేదు.

ఇలా డూప్ లేకుండా కొన్ని సన్నివేశాలలో నటిస్తే ఏదైనా జరగరానిది జరిగితే ఎంతో నష్టం వాటిల్లుతుంది అందుకే కొన్ని సన్నివేశాలలో డూప్ సహాయంతోనే నటించాలని ఈయనకు ఎన్నో సందర్భాలలో పలువురు డైరెక్టర్లు సలహాలు ఇచ్చిన వినలేదట.ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో( Nenokkadine Movie ) అయితే ఏకంగా ఒక భవనం నుంచి మరో భవనం పైకి డూప్ లేకుండా దూకేసారని గతంలో తెలిపారు .ఇక రాజమౌళి కూడా ఇదే విషయంలో మహేష్ బాబుకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఈ అలవాటును మార్చుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.







