ఒక మంచి ఐడియా జీవితం మారుస్తుంది.“ఈ ఆలోచన నాకెందుకు రాలేదు?” అనిపించే అద్భుతమైన వ్యాపార మోడల్‌ను దీపక్ గోయల్( Deepak Goyal ) పరిచయం చేశారు.మహాకుంభమేళాలో( Mahakumbh Mela ) ఆయన అందిస్తున్న ప్రత్యేక సేవ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ప్రతీ హిందువు జీవితంలో కుంభమేళాలో స్నానం చేయడం ఓ మహత్తరమైన కాంక్ష.
కానీ అందరికీ ఆ అవకాశం లభించడం సాధ్యం కాదు.ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం చూపించారు దీపక్ గోయల్.
ప్రయాగరాజ్‌కు చెందిన ఈ యువకుడు “ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్”( Prayag Enterprises ) అనే సంస్థను ప్రారంభించి భక్తులకు “డిజిటల్ స్నాన్” సేవలను అందిస్తున్నారు.

భక్తులు తమ ఫోటోను( Photo ) మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తే, దీపక్ గోయల్ వారి ఫోటోను ఫిజికల్ గా తయారుచేసి గంగా జలాల్లో స్నానం చేయిస్తూ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ఈ సేవకు రూ.1100 ఫీజుగా వసూలు చేస్తున్నారు.కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి దీపక్ గోయల్ సేవలకు విపరీతమైన స్పందన వస్తోంది.స్నానం చేయలేని వేలాది మంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

దీని ద్వారా ఆయన రోజుకు లక్షలు సంపాదిస్తున్నారు.ప్రారంభ దశలో మోనాలిసా భోంస్లే అనే యువతి కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఇప్పుడు దీపక్ గోయల్ ఐడియానే హాట్ టాపిక్‌గా మారింది.ఎంతో వినూత్నంగా, సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఈ సేవలను అందించడం వలన ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ యూనిక్ ఐడియా ద్వారా దీపక్ గోయల్ స్టార్టప్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికారు.
కొత్త వ్యాపారం అంటే బిలియన్ల ఆదాయం రాదని కొన్ని సెటైర్లు వినిపిస్తున్నప్పటికీ, సరైన ఆలోచనతో ఎంతటి విజయాన్ని సాధించవచ్చో దీపక్ గోయల్ నిరూపించారు.