1.ఎంసెట్ స్పెషల్ కేటగిరి కోసం ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రం
తెలంగాణ లో ఎంసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా స్పెషల్ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
2.బండి సంజయ్ కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని, చేసేవన్నీ మోసలేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
3.అమిత్ షా పై కేటీఆర్ విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం అమిత్ షా అవివేకం అని, ఈ దశాబ్దపు జోక్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
4.జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టు కు ఉన్న 25 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
5.తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణ దేశానికే ఆదర్శం అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
6.బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా

ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కాం లో టీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత పేరు ఉందని బిజెపి మంత్రి పర్వేజ్ వర్మ కామెంట్స్ చేయడం పై కవిత స్పందించారు.బీజేపీ నేతల ఆరోపణల పై పరువు నష్టం దావా వేస్తున్నట్టు కవిత తెలిపారు.
7.ఎమ్మెల్యే వంశీ కి హై కోర్టు నోటీసులు
టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.గనుల అక్రమ తవ్వకాలపై నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై ఈ నోటీసులు జారీ చేసింది.
8.రేపు ఇంటర్ కళాశాలల బంద్

తెలంగాణలో రేపు ఇంటర్ కళాశాలలో బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు.
9.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ

కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తో ఏపీ సీఎం జగన్ నేడు భేటీ అయ్యారు.
11.డీజీపీ కి చంద్రబాబు లేఖ
కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ మృతిపై ఏపీ డీజీపీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
12.నారాయణని అడ్డుకున్న పోలీసులు

ఋషికొండలు తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన సిపిఐ కార్యదర్శి నారాయణ ను పోలీసులు అడ్డుకున్నారు.
13.రాష్ట్రపతి తో జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో భేటీ కానున్నారు.
14.ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు కోర్టులో ఊరట

ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఎంపీ రఘురాం కృష్ణంరాజు కుమారుడు భరత్ , ఆయన వ్యక్తిగత సిబ్బందిపై పోలీసులు నమోదు చేసిన కేసులు పై విచారణ చేసిన న్యాయస్థానం తదుపరి ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని చెప్పింది.
15.పవన్ పై కొడాలి నాని కామెంట్స్
కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
16.ప్రధాని మోదీతో ముగిసిన జగన్ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ తో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది.
17.తమ్మినేని కృష్ణయ్య హత్యను ఖండిస్తున్నా : తుమ్మల
టిఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
18.హైదరాబాద్ లో బయోటెక్ కంపెనీలో పేలుడు

జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.ఒకేసారి ఐదు రియాక్టర్లు పేలడంతో భారీ శబ్దం వచ్చింది.ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
19.ఏపీ క్యాబినెట్ సమావేశం
ఈ నెల 29 న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,600 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -51,930
.