గొల్లపూడి మారుతీరావు.ఈ పేరు ప్రేక్షకులకు తెలియనిది కాదు.కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు.కానీ ఇలాంటి గొప్ప నటుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాస్తఇంట్రడక్షన్ మాత్రం ఇవ్వాల్సిందే మరి.పాత్ర ఏదైనా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం లో గొల్లపూడి మారుతీ రావు దిట్ట అని చెప్పాలి.వందల సినిమాల్లో నటించి విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు ఆయన.కేవలం నటుడు మాత్రమే కాదు అంతకుముందే రచయితగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా నటుడిగా రచయితగా దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న గొల్లపూడి మారుతీరావు కు మొదట్లో నటుడిగా ఎదగడానికి సహకరించిన సినిమా మాత్రం చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా అని చెప్పాలి.
చిరంజీవి మాధవి జంటగా నటించిన ఈ సినిమాతో వెండితెరపై నటుడిగా అడుగుపెట్టాడు గొల్లపూడి మారుతీరావు.తొలి సినిమాలోని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమాకు ముందు ఒకవైపు రచయితగా మరోవైపు సగటు ఉద్యోగిగా జీవితం మొత్తం గడిచిపోయింది.
![Telugu Chiranjeevi, Entloramayya, Gollapudi, Raghava, Villain, Writer-Telugu Sto Telugu Chiranjeevi, Entloramayya, Gollapudi, Raghava, Villain, Writer-Telugu Sto]( https://telugustop.com/wp-content/uploads/2022/06/Chiranjeevi-entlo-ramayya-veedilo-krishnaiah.jpg)
కానీ తనలోని నటుడిని ప్రాణం పోయాలని అనుకుంటున్న సమయంలోనే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో అవకాశం వచ్చింది.ఈ సినిమాలో అవకాశం ఇవ్వడానికి కూడా పెద్ద స్టోరీనే ఉంది. కె రాఘవ తీసిన తర్వాత ఈ సినిమా కథను గొల్లపూడి రాశారు.
ఈ క్రమంలోనే అందులోని ఒక పాత్ర తీరు చదివినపుడు ఈ వేషం మీరే వెయ్యాలి అన్నాడు రాఘవ.నవ్వేసి ఊరుకున్నారు గొల్లపూడి.తర్వాత కొన్నాళ్ళకి తరంగిణి షూటింగ్ వాయిదా పడింది.ఈ క్రమంలోనే కోడి రామకృష్ణ గొల్లపూడి ఇంటికి వచ్చి మీరు ఒక వేషం వేయాలని అన్నారు.
![Telugu Chiranjeevi, Entloramayya, Gollapudi, Raghava, Villain, Writer-Telugu Sto Telugu Chiranjeevi, Entloramayya, Gollapudi, Raghava, Villain, Writer-Telugu Sto](https://telugustop.com/wp-content/uploads/2022/06/unknown-facts-Gollapudi-Gollapudi-marutirao.jpg )
గొల్లపూడి కూడా ఓకే చెప్పేశారు.ఈ క్రమంలోనే సుబ్బారావు అనే ప్రముఖ పాత్రను తనతో వేయించాలని చూస్తున్నారు అంటూ గొల్లపూడి కి అర్థమైంది.ఆ సమయంలో నేను పాత్ర వేస్తాను నా నటన నచ్చకపోతే నన్ను తీసి వేరే వాళ్లను పెట్టుకోండి అంటూ మొహం మీదే మొహమాటం లేకుండా చెప్పేసారు గొల్లపూడి.ఇలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో సుబ్బారావు పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తనలోని నటుడిని ప్రాణం పోశారు గొల్లపూడి.