నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా అందరు సినిమా వైపు చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని బ్రహ్మణ యువకుడిగా.
నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా కనిపించబోతున్నట్లుగా మొదటే క్లారిటీ ఇచ్చారు వీరిద్దరి మద్య ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
ఈ సినిమా లో కీలక పాత్రల్లో సీనియర్ నరేష్ మరియు నదియాలతో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు మరియు కమెడియన్స్ కనిపించబోతున్నారు.సినిమా లో నాని పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ట్రైలర్ లోనే చూపించారు.
ట్రైలర్ లో చూసిన దానితో పోల్చితే మరింత విభిన్నంగా సినిమాలో కనిపించబోతున్నట్లుగా నాని మరియు యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నాని మరియు ఇతర ఏ హీరో కూడా ఇలాంటి ఒక కామిక్ పాత్రలో కనిపించలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
కనుక ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ చాలా మంది నమ్ముతున్నారు.మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
అడ్వాన్స్ బుకింగ్ లు ఓ రేంజ్ లో అయ్యాయి.కనుక సినిమా ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది అంటూ నమ్మకం వ్యక్తం అవుతోంది.
అంటే సుందరానికి సినిమా లో నాని మరియు నజ్రియాల ప్రేమ చాలా విభిన్నంగా ఉంటుందట.సినిమా కు క్లీన్ యూ సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా చాలా ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా ఈ సినిమా టాలీవుడ్ లో ఈ ఏడాది మరో విజయం సాధించిన సినిమా గా నిలుస్తుందని అంటున్నారు.







